calender_icon.png 1 May, 2025 | 2:31 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఉపాధ్యాయ వృత్తి సమాజానికి మేలు చేసేది

30-04-2025 06:06:35 PM

నిర్మల్ (విజయక్రాంతి): అన్ని ఉద్యోగాల కంటే ఉపాధ్యాయ ఉద్యోగం ఎంతో గొప్పదని ఈ వృత్తి ద్వారా సమాజంలో ప్రతి ఒక్కరిని విజ్ఞానవంతులుగా చేసే అవకాశం లభిస్తుందని జిల్లా విద్యాశాఖ అధికారి రామారావు అన్నారు. బుధవారం నిర్మల్ జిల్లాలోని విద్యాశాఖలో పనిచేస్తూ పదవీ విరమణ పొందుతున్న పలు ఉపాధ్యాయులను సన్మానం చేసి వీడ్కోలు సమావేశం ఏర్పాటు చేశారు. విద్యాశాఖలో పనిచేసి పదవీ విరమణ పొందుతున్నప్పటికీ రాబోయే కాలంలో విద్యాభివృద్ధికి వారు కృషి చేయవలసిన అవసరం ఎంతైనా ఉందని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో అధికారులు మోడరన్ పరమేశ్వర్ నరసయ్య వినోద్ కుమార్ వివిధ సంఘాల నాయకులు రాజేష్ నాయక్ వినోద్ కుమార్ భూమన్న యాదవ్ రమణారావు నరేంద్రబాబు షబ్బీర్ అలీ తదితరులు ఉన్నారు.