24-04-2025 12:47:56 AM
తెలంగాణ జనసమితి గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షుడు ఎం.నర్సయ్య
ముషీరాబాద్, ఏప్రిల్ 23 (విజయక్రాంతి): కశ్మీర్ పర్యటకులపై ఉగ్రవాధులు జరిపిన దాడిని తెలంగాణ జనసమితి గ్రేటర్ హైదరాబాద్ కమిటీ అధ్యక్షుడు ఎం. నర్సయ్య తీవ్రంగా ఖండించారు. ఈ మేరకు బుధవారం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ... కాశ్మీర్‌లో దాడి చేసే ఉగ్రవాదులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. టూరిస్టులకు రక్షణ కల్పించి స్వస్థలాలకు వెంటనే చేర్చాలని కోరారు.
బాధిత కుటుంబాలకు ప్రభుత్వం నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. తెలంగాణ ప్రాంతానికి చెందిన సుమారు 500 మంది కాశ్మీర్లో ఉన్నారని వారిని వెంటనే హైదరాబాద్కు తీసుకువచ్చే విధంగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చర్యలు తీసుకోవాలని కోరారు.
ఉగ్రవాదుల దాడికి నిరసనగా కాశ్మీర్లో చనిపోయిన కుటుంబాలకు సంఘీభావం తెలు పుతూ రాష్ట్ర వ్యాప్తంగా కొవ్వొత్తుల ప్రదర్శన నిర్వహిస్తామని పేర్కొన్నారు. ఈ సమావేశంలో తెలంగాణ జనసమితి గ్రేటర్ హైదరా బాద్ ప్రధాన కార్యదర్శి రాంచందర్, వర్కిం గ్ ప్రసిడెంట్ మహ్మద్ అబ్దుల్, నాయకులు ఇస్మాయిల్, సురేష్ కుమార్, హనుమంతు గౌడ్, బాషా తదితరులు పాల్గొన్నారు.