calender_icon.png 15 August, 2025 | 11:45 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బీసీ రిజర్వేషన్‌లు అమలు చేసిన తర్వాతే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలి

15-08-2025 01:20:05 AM

- లేనిపక్షంలో రాష్ట్రంలో యుద్ధమే..

- 25న ఇందిరాపార్క్ ధర్నా చౌక్‌లో సత్యాగ్రహ దీక్ష..

- బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు, ఎంపీ ఆర్.కృష్ణయ్య

ముషీరాబాద్, ఆగస్టు 14 (విజయక్రాంతి): బీసీలకు 42 శాతం  రిజర్వేషన్లు అమలు చేసిన తర్వాతనే స్థానిక సంస్థల ఎన్నికలకు నిర్వహించాలని  జాతీయ బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు, ఎంపీ ఆర్. కృష్ణయ్య సీఎం రేవంత్ రెడ్డిని డిమాం డ్ చేశారు. లేనిపక్షంలో రాష్ట్రంలో యుద్ధమే జరుగుతుందని ఆయన హెచ్చరించారు. ఇదే డిమాండ్ తో ఈనెల 25న ఇందిరా పార్క్ ధర్నా చౌక్ లో ’సత్యాగ్రహ దీక్ష’ ను చేపట్టనున్నట్లు ఆయన ప్రకటించారు.

ఈ మేరకు గురువారం బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్ లో 14 బిసి సంఘాల సమావేశం బీసీ సంక్షేమ సంఘం జాతీయ ఉపాద్యక్షులు గుజ్జ సత్యం అధ్యక్షతన జరిగింది. ముఖ్య అతిధిగా ఎంపీ ఆర్.  కృష్ణయ్య హాజరై మాట్లాడుతూ 42 శాతం బీసీ రిజర్వేషన్  లపై రాష్ట్ర ప్రభుత్వం తరపున పూర్తి అధికారాలు వినియోగించు కోకుండా, కేంద్రంపై నెట్టి తప్పించుకునే మార్గాలు చూస్తుందని ఆయన ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వానికి రాజ్యాంగ అధికారం ఇచ్చిందని, సుప్రీం కోర్టులో మాండమస్ పిటిషన్ వేయాలని అన్నారు.

42 శాతం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీ చేసిన కామారెడ్డి డిక్లరేషన్ అమలు చేసే భాధ్యత విస్మరించొద్దని అన్నారు. అన్ని పార్టీల మద్దతుతో ప్రత్యామ్న్యాయ మార్గా లు వెతికి 42 శాతం రిజర్వేషన్ సాదించాలన్నారు. లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా తిరు గుబాటు యుద్ధం తప్పదని హెచ్చరించారు. అసెంబ్లీ ఆమోదించిన రెండు బీసీ బిల్లులు గవర్నర్ వద్ద మూడు నెలలుగా పెండింగ్ లో ఉన్నాయన్నారు.

గుజ్జ సత్యం మాట్లాడుతూ బీసీ రిజర్వేషన్స్ కోసం కేవలం ధర్నా లు, నిరసనలు సరిపోదని, న్యాయ పరంగా పోరాటం చేయాల్సిన అవసరం ఉందన్నారు. ఈ సమావేశంలో జాతీయ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్  నీల వెంకటేష్ ముదిరాజ్, బీసీ యువజన సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జిల్లపల్లి అంజి, బీసీ ఐక్యవేదిక అధ్యక్షుడు జి. అనంతయ్య, సి. రాజేందర్, పగిళ్ల సతీష్, అనురాధ, గంగా పురం పద్మ, శివ, చిక్కుడు బాలయ్య, కిషోర్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.