calender_icon.png 14 July, 2025 | 9:21 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బీజేపీ దిమ్మెను ధ్వంసం చేసిన దుండగులను శిక్షించాలి

14-07-2025 12:41:18 AM

చారకొండ, జూలై 13: నాగర్కర్నూల్ జి ల్లా చారకొండ మండలం చంద్రాయన్పల్లి గ్రామంలో బీజేపీ దిమ్మెకు సంబంధించిన జెండా పైపును కొంతమంది గుర్తుతెలియని దుండగులు ధ్వంసం చేశారు. ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి గంగి శెట్టి నాగరాజు మాట్లాడుతూ, ప్రజాస్వామ్యంలో ఇలాంటి విధ్వంస చర్యలు మంచివి కావన్నారు.

ఇది కేవలం ఓ పార్టీ ప్రతినిధి స్థ లాన్ని ధ్వంసం చేయడమే కాదు ప్రజాస్వా మ్య విలువల మీద దాడి. ఇలాంటి దాడులకు పాల్పడినవారిని వెంటనే గుర్తించి అరె స్ట్ చేసి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చే శారు. వారితో పాటు చారకొండ మండల బీ జేపీ అధ్యక్షుడు చెలమోని కృష్ణ వెంకట్ గౌడ్, కన్నా, చంద్రారెడ్డి, శ్రీను, గోలి రాజు, నో ముల శంకర్ గౌడ్, రాము యాదవ్ శరత్ తదితరులుపాల్గొన్నారు.