10-09-2025 12:00:00 AM
వరంగల్ జిల్లా కిష్టాపురం గ్రామంలో పేద బలహీన వర్గాల కుటుంబ ంలో జన్మించిన చాకలి (చిట్యాల) ఐలమ్మ 1895, సె ప్టెంబర్ 10న మరణించి ంది. నాటి నిజాం పాలనలో రజాకార్లకు, పాలకుర్తి భూస్వామ్య దొరలకు వ్యతిరేకంగా భూ మికోసం, భుక్తి కోసం వెట్టిచాకిరి.. విముక్తి కోసం తాను చేసిన పో రాటం ఐలమ్మని వీర వనితగా నిలబెట్టడమే కాదు భూమి లేని పే దలకు భూమిని పంచే పోరాటాలకి నాంది పలికింది.
కులవృత్తితో పాటు కౌలు వ్యవసాయం చేసుకునే కౌలు రైతు చాకలి ఐలమ్మ. వెట్టి చాకిరి చేయడానికి నిరాకరించి తన పంటను రక్షించుకోవటం కోసం ఆంధ్ర మహాసభ, భారత కమ్యూనిస్టు పార్టీ సభ్యురాలుగా నాటి పాలకుర్తి దేశ్ ముక్ విస్నూర్ రామచంద్రారెడ్డి, రజాకార్ల అ రాచకాలకు ఎదురు నిలిచి రోకలిబండలతో తిరగబడిన దీశాలి ఐ లమ్మ. దొరల పొలంలో పనిచేయటానికి నిరాకరించి తాను కౌ లుకు చేసి పండించిన పంటను ఎత్తుకెళ్లడానికి వచ్చిన దేశ్ ముక్ అనుచరులను ఆంధ్ర మహాసభ కార్యకర్తలతో ఎదిరించి తన ప ంటను కాపాడుకోవడం గొప్ప విషయం.
అంతేకాదు దేశ్ ముక్ అ నుచరులు, రజాకార్లు తన ఇంటిని తగలబెట్టడంతో పాటు ఆమె కుమారులపై కేసులు పెట్టి జైలుకు పంపినా, తన కూతురిపై అత్యాచారం చేసినా.. ‘ఈ దొరగాడు ఇంతకంటే ఏ విధంగా న ష్టపెట్టగలడని’ తెగించి పోరాడిన వీర వనిత చాకలి ఐలమ్మ. ఈ భూమి నాది .. పండించిన పంట నాది.. తీసుకెళ్లటానికి, దోచుకెళ్లటానికి దొర ఎవ్వడు.. నా ప్రాణం పోయాకే ఈ పంట ఈ భూమి మీరు దక్కించుకోగలరని.. దేశ్‌ముక్‌లకు, రజాకార్లకు వ్యతిరేకంగా ఐలమ్మ చేసిన పోరాటంతో మొదలైన భూపోరాటం తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంగా మారి లక్షలాది ఎకరాలు భూమిలేని పేదలకు పంచబడింది.
కమ్యూనిస్టు నాయకులు భీంరెడ్డి నరసింహారెడ్డి, ఆరుట్ల రామచంద్రారెడ్డి, ఆరుట్ల కమలాదేవి, చకిలం యాదగిరి నాయకత్వంలో పాలకుర్తి దేశ్ ముక్ రామచంద్రారెడ్డికి వ్యతిరేకంగా ఐలమ్మ చేసిన పో రాటం నేటితరం మ హిళలకు ఒక స్ఫూర్తిగా నిలుస్తుంది. రాణి రు ద్రమ, సమ్మక్క సారలమ్మ, చాకలి ఐలమ్మ స్ఫూర్తితో మహిళలు తమ సాధికారత వైపు కి అడుగులు వేసినప్పుడే వారి పోరాటానికి సార్ధకత ఏర్పడుతు ంది.
చాకలి ఐలమ్మను స్మరించుకోడానికి 2022 నుంచి తెలంగాణ రాష్ర్ట ప్ర భుత్వం ఐలమ్మ వర్ధంతి కార్యక్రమాన్ని అధికారికంగా నిర్వహించడమే కాదు రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం కోఠి మ హిళా విశ్వవిద్యాలయానికి ‘వీరనారి చాకలి ఐ లమ్మ విశ్వవిద్యాలయం’గా పేరు మార్చడం అభినందనీయం.
డాక్టర్ తిరునహరి శేషు, 9885465877