calender_icon.png 10 September, 2025 | 7:19 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పెండింగ్ కేసులకు మోక్షమెప్పుడో!

09-09-2025 01:23:16 AM

భారతదేశంలోని వివిధ కోర్టుల్లో 5 కోట్ల 38 లక్షల 99వేల 701 పెండింగ్ కేసులతో ప్రపంచంలోనే అగ్రస్థానంలో ఉన్నట్లు నేషనల్ జ్యూడిషియల్ ల్ గ్రిడ్, నీతి ఆయోగ్ నివేదిక పే ర్కొంది. ఈ పెండింగ్ కేసులను క్లియర్ చెయ్యడానికి సుమారు 324 సంవత్సరా లు పైనే పడుతుందని కూడా అంచనా వే సింది. ఈ పెండింగ్ కేసుల వల్ల ఎందరో నిర్దోషులు కూడా తమ జీవితాలు ఏ విచారణ లేకుండానే జైలులోనే మగ్గాల్సి వస్తో ందని మానవ హక్కుల సంఘాల అభిప్రాయం.

ఎందరో అండర్ ట్రయల్ ఖైదీ లకు పూచీకత్తు ఇచ్చేవారు లేక, ఆర్ధిక భా రంతో న్యాయ సహాయం పొందలేని నిస్సహయతే ఇందుకు కారణాలు. ఎన్నో పెద్ద నేరాల్లో ఉన్న నేరస్థులు కోర్టులకు రాకపోయినా, ఏళ్ల తరబడి బెయిల్ మీదే ఉంటు న్నారు. సామాన్యుల విషయంలో విచారణకు రాక ఏళ్ళ తరబడి అండర్ ట్రయల్ ఖైదీలుగా జైళ్ళల్లో మగ్గడం లాంటి విషయాలు న్యాయ కోవిదులు, మేధావులు  అంతుచిక్కని విషయంగా పేర్కొంటున్నా రు. ఇదే కొన్ని సంవత్సరాలుగా న్యాయ వ్యవస్థ ప్రతిష్టను మసకబారుస్తోందని ఆవేద న చెందుతున్నారు.

ట్రయల్ ఖైదీలకు శాపంలా

ఇటీవల తమిళనాడులోని కట్టం కులత్తూరులోని ఎస్‌ఆర్ ఎం స్కూల్ ఆఫ్ లా లో ‘ద క్రాడిల్ ఫర్ ఫ్యూచర్ జూరిస్ట్స్’ పేరు తో నిర్వహించిన కాంక్లేవ్‌లో సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ నెక్కం టి వెంకటరమణ కీలకోపన్యాసం చేశారు. ‘సకాలంలో న్యాయమూర్తుల ఖాళీలను భర్తీ చేసి ప్రాసిక్యూటర్లను నియమించటం పైనే న్యాయవ్యవస్థ సమర్ధత ఆధారపడి ఉంటుంది. ఇప్పుడు మనం పరిపాలనా జోక్యం అతిగా ఉన్న రోజుల్లో జీవిస్తున్నాం. ఈ సంస్కృతే న్యాయ వ్యవస్థపై కేసుల పెండింగ్ భారాన్ని పెంచుతోంది’ అని పేర్కొన్నారు.

కార్యనిర్వాహక వ్యవస్థ ఏదై నా ఒక నిర్ణయం తీసుకునేముందు సహజ న్యాయ సూత్రాలు పాటించాల్సి వుంటుందని అభిప్రాయం వ్యక్తమవుతోంది. కోర్టు ల్లో సుదీర్ఘ విచారణ ప్రక్రియే అండర్ ట్రయల్ ఖైదీలకు శిక్షగా మారిందన్నారు. అయితే దీన్ని సరిదిద్దేందుకు పబ్లిక్ ప్రాసిక్యూటర్ల నుండే సంస్కరణలు మొదలెట్టి వారికి సంపూర్ణ స్వేచ్ఛ ఇచ్చి కోర్టులకే జవాబు దారిగా ఉండేలా చూడాలి. ఇలాంటి పొరపాట్లు చేసి పెండింగులకు కారకులైన పోలీసులను కూడా జవాబుదారి చెయ్యాల్సిన అవసరముంది. అయితే సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఉన్న సమయంలో మార్పునకు జస్టిస్ వెంకటరమణ ఒక అడుగు ముందుకేసి అంకురార్పణ చేస్తే బాగుండేది.

జిల్లా కోర్టుల్లోనే ఎక్కువగా

ఇక దేశంలోని కోర్టుల్లో పెండింగ్ కేసు ల విషయం పరిశీలిస్తే.. భారత సుప్రీంకోర్టులో గత నెల ఆగస్టు వరకు పెండింగ్‌లో ఉన్న మొత్తం కేసుల సంఖ్య 87,560 కా గా.. వివిధ రాష్ట్రాల హైకోర్టుల్లో  63,68,480, వివిధ జిల్లా కోర్టులలో 4,74,43,661.. మొత్తంగా 5,38,99,701 పెండింగ్ లో వున్నట్లు నివేదికలో పేర్కొన్నారు. సుప్రీం, హైకోర్టులు కలిపి మొత్తం గా 64,56,040 ఉండగా.. మిగిలిన మొత్తం కేసులు జిల్లా కోర్టుల పరిధిలో పెండింగ్‌లో ఉండడం గమనార్హం. కాగా పెండింగ్‌లో ఉన్న 20 శాతం కేసుల్లో భూమి, ఆస్తి వివాదాల కేసులే అత్యధికం. భారత న్యాయవ్యవస్థ ముందు ఇంత భారీ సంఖ్యలో కేసులు పెండింగ్‌లో ఉండటం అతిపెద్ద సవాలుగా మారింది.

కోర్టుల్లో కేసులు సమయం తీసుకుంటుండటంతో బాధితులకు న్యాయం అందించడంలో జా ప్యం జరుగుతుందన్నది వాస్తవం. ఏప్రిల్ 2022లో, బీహార్ రాష్ర్టంలోని ఒక కోర్టు లో అండర్ ట్రయల్ ఖైదీకి 28 సంవత్సరాలు జైలులో గడిపిన తర్వాత ఆధారాలు లేకపోవడంతో హత్య కేసులో ఆ వ్యక్తిని నిర్దోషిగా విడుదల చేశారు. అంటే ఏ నేరం చేయకపోయినా సకాలంలో విచారణ జరగకపోవడంతో జైలుశిక్ష అనుభవించిన ఒక నిరపరాది తన జీవితాన్నే కోల్పోవాల్సి వచ్చింది. వందమంది నేరస్తులు తప్పుకు న్నా గాని ఒక నిర్దోషికి శిక్ష పడకూడదని భారత న్యాయ సూత్రం మాటేమయిందని నిర్దోషుల కుటుంబాలు ప్రశ్నిస్తున్నాయి. వరల్డ్ జస్టిస్ ప్రాజెక్ట్ ప్రచురించిన దేశ ర్యాంకింగ్ అయిన రూల్ ఆఫ్ లా ఇండెక్స్ 2023, ప్రకారం పౌర న్యాయంలో 142 దే శాలలో భారతదేశం 111వ స్థానంలో, నేర న్యాయంలో 142 దేశాల్లో 93వ స్థానంలో ఉందని పేర్కొందంటే ఆ విషయం ఆలోచించాల్సి ఉంది.

తగినంత సంఖ్య లేక

నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో (ఎన్‌సీఆర్‌బీ) గతంలో విడుదల చేసిన ప్రిజన్ స్టాటిక్స్ ఆఫ్ ఇండియా 2022 నివేదిక ప్రకారం అప్పటికి జైలులో వున్న ఖైదీలలో 75.8 శాతం అండర్ ఖైదీలే కాగా 76.33 శాతం మహిళా విచారణ ఖైదీలే. కాగా వారిలో 8.6 శాతం మంది మూడు సంవత్సరాలకుపైగా ఏ విధమైన విచారణ లేకుండా జైలులో జీవితం గడిపేశారు. ఇక సుప్రీంకోర్టు అనుబంధం అయిన సెంటర్ ఫర్ రీసెర్చ్ అండ్ ప్లానింగ్ ప్రకారం భారతదేశంలోని జైళ్లు స్థాయికంటే అధికంగా 131 శాతం ఆక్యుపెన్సీతో పనిచేస్తున్నాయని తెలిపింది.

ఆర్టికల్ 39 ప్రకారం ఉచిత న్యాయ సహాయానికి ప్రభుత్వం హామీ ఇస్తున్నా అత్యధికంగా ఉన్న విచారణ ఖైదీలకు.. న్యాయవాదుల సంఖ్య నిష్పత్తి తగినంత లేకపోవటం కూడా ఆలస్యానికి ఒక కారణం. 2022లో, భారత దేశంలో మంజూరు చేయబడిన న్యాయమూర్తుల సంఖ్య మిలియన్ జనాభాకు 21.03 మంది న్యాయమూర్తులు ఉండాలి. సుప్రీంకోర్టులో అనుమతించబడిన న్యా యమూర్తుల సంఖ్య 34, హైకోర్టుల్లో 1,108, జిల్లా కోర్టుల్లో ఈ సంఖ్య 24,631 గా ఉంది. అయితే భారత లా కమిషన్, జస్టిస్ వి.ఎస్. మలిమత్ కమిటీ గతంలో న్యాయమూర్తుల సంఖ్యను 10వేల జనాభాకు 50 మంది న్యాయమూర్తులను లే దా ఒక్కొక్క న్యాయమూర్తికి 20 వేల జనా భా వంతున ఉండేలా పెంచాలని సిఫార్సు చేసినప్పటికీ అమలు మాత్రం శూన్యం.

ఆ బాధ్యత న్యాయస్థానాలదే

2022 నివేదిక ప్రకారం భారతదేశంలో ప్రతి 10 లక్షల మంది (మిలియన్) జనాభాకు 14.4 మంది న్యాయమూర్తులు ఉం డగా.. కానీ దేశంలో న్యాయమూర్తుల ని యామక ప్రక్రియ ఆలస్యంగా జరుగుతు ంది. సుప్రీంకోర్టు న్యాయమూర్తులను భా రత ప్రధాన న్యాయమూర్తి, సుప్రీంకోర్టులోని మిగిలిన నలుగురు సీనియర్ న్యా యమూర్తులతో కూడిన సుప్రీం కొలీజి యం నియామకానికి సిఫార్సు చేస్తుంది. రాష్ర్టపతి నియమించే ముందు ఆ పేర్లను కేంద్ర ప్రభుత్వం ఆమోదించాల్సి ఉంటుం ది. అలాగే హైకోర్టు న్యాయమూర్తుల ని యామకం కోసం కూడా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి, మిగిలిన ఇద్దరు సీనియర్ న్యాయమూర్తులతో కూడిన హైకోర్టు కొలీజియం సిఫార్సు చేస్తుంది.

జడ్జీలను నియ మించే ముందు ఈ పేర్లను రాష్ట్రపతి సహా కేంద్ర ప్రభుత్వం, భారత ప్రధాన న్యాయమూర్తి, రాష్ర్ట ప్రభుత్వం, గవర్నర్ ఆమో దించాల్సి ఉంటుంది. యూరప్‌లో ప్రతి మిలియన్ జనాభాకి 210 మంది న్యాయమూర్తులు, అమెరికాలో 150 మంది న్యా యమూర్తులున్నారు.  కేంద్ర ప్రభుత్వం, రాష్ర్ట ప్రభుత్వం న్యాయమూర్తుల నియామకంలో భారత ప్రధాన న్యాయమూర్తి, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి కొలీజి యం సూచనకు కట్టుబడి ఉండాల్సిదే. కేం ద్ర ప్రభుత్వం ఈ నియామకాన్ని ఏవో కా రణాలతో ఆలస్యం చేయడం లేదా నియామకం కోసం పేర్లను తిరిగి పంపడం జరు గుతుంది.

నియమం ప్రకారం కొలీజియం పేర్లను పునరుద్ఘాటిస్తే కేంద్ర ప్రభుత్వం మూడు లేదా నాలుగు వారాల్లో వారి నియామకాలను ఆమోదించాలి. అయితే మన దేశంలో ఎన్డీఏ ప్రభుత్వానికి ముం దు అలా జరిగిన దాఖలాలు లేవనే చెప్పా లి. కొన్ని సందర్భాల్లో, కేంద్ర ప్రభుత్వం ఆమోదం కోసం పేర్లు పెండింగ్‌లో ఉండ టం వల్ల న్యాయమూర్తుల నియామకం 4 సంవత్సరాలకి కూడా గతంలో ఆలస్యం అయిందని రికార్డులు తెలుపుతున్నాయి. ఇప్పుడైనా న్యాయమూర్తులు, సిబ్బంది నియామకంలో ఇప్పటికే ఉన్న వేగం మరింత వేగవంతం చేసి మౌలిక సదుపాయలు, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం పెంచాల్సి ఉంది. విచారణకు రాకుండా.. విచారణ లేకుండా తాము దోషులమో, నిర్దోషులమో అని తెలియని అయోమయంతో ఏళ్ళ తరబడి జైళ్లలో మగ్గుతున్న వారి కేసులను తేల్సాల్సిన బాధ్యత న్యాయస్థానాలదే!