15-08-2025 03:03:30 PM
పెన్ పహాడ్: 79వ స్వాతంత్ర దినోత్సవ(Independence Day) వేడుకలు పురస్కరించుకొని పెన్ పహాడ్(Penpahad)లో మూడు రంగుల త్రివర్ణ పతాక జెండా రెపరెపలాడింది. ఈ సందర్భంగా తహసిల్దార్ కార్యాలయంలో తాసిల్దార్ లాలూ నాయక్, మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీడీవో జానయ్య, పోలీస్ స్టేషన్లో ఎస్సై గోపికృష్ణ, ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో మండల వైద్యాధికారి డాక్టర్ రాజేష్, వ్యవసాయ కార్యాలయంలో ఏఓ అనిల్ కుమార్, పిఎసిఎస్ కార్యాలయంలో చైర్మన్ వెన్న సీతారాం రెడ్డి, మండల సమైఖ్య కార్యాలయంలో ఏపీఎం అంజయ్య, ఎంఈఓ రవి, కేజీబీవీ లో ఎస్ఓ ఆసియా జబీన్, బీసీ వసతి గృహంలో HWO మాలిక, ప్రెస్ క్లబ్ లో అధ్యక్షులు ఒగ్గు సోమయ్య అలాగే ఆయా గ్రామ పంచాయతీల ఎదుట ప్రత్యేక అధికారులు పంచాయతీ కార్యదర్శులు జాతీయ జెండా ఎగురవేశారు.