నిగ్గు తేలిన నిజం!
- అయినా దాటవేత ధోరణిలో అధికారులు
- నేటికీ దక్కని న్యాయం
మానకొండూరు, ఆగస్టు 21, (విజయక్రాంతి): జగ్గయ్యపల్లి గ్రామ పంచాయతీ పరిధిలో ఉపాధి హామీ (విబిజీ రాంజీ) పనులకు సంబంధించి మే 26 న మండల అధి కారులు చేపట్టిన విచారణను సవాలు చేస్తూ తిరిగి కేంద్ర ప్రజా ఫిర్యాదుల విభాగంలో రాష్ట్ర కమిషనర్ కు ఫిర్యాదు చేయగా& తా జాగా జిల్లా డిఆర్ డి ఏ విభాగం చేపట్టిన వి చారణలో మండల స్థాయి అధికారులు, మాజీ ఉద్యోగులు, ఇతర అధికార గణం జగ్గయ్యపల్లి గ్రామ పంచాయతీలో బహిరంగ విచారణ జరిపారు.
ఈ విచారణలో ఫిర్యాదుదారు వ్యాట గోపాల్ రెడ్డి ప్రతి విషయంపై ఆధారాలతో ప్రశ్నించాడు. ఇందులో భాగం గా, ఖచ్చితంగా నిర్వహించవలసిన క్యాష్ బుక్, నోట్ ఫైల్ గత రెండు సంవత్సరాలుగా మాజీ కార్యదర్శి ప్రేమ్ కుమార్ ఆధీనంలో ఉండడం , ఎర్రమట్టి తరలింపుకు సంబంధించి నిర్దిష్ట ఎఫ్ టి ఓ లు ఉన్నప్పటికీ సం బంధం లేని దొంగ బిల్లులు ఎర్రమట్టి తరలింపు జరిగినట్టు సృష్టించడం, వరంగల్ నుండి జగ్గయ్యపల్లికి 3,000 రూపాయలకే ఎర్రమట్టి తరలింపు వంటి నమ్మశక్యం గాని అక్రమ బిల్లులపై, ఇంచార్జ్ కార్యదర్శి సుష్మిత చేసిన లావాదేవీలపై.. ఆధారాలతో కూడిన సందేహాలను లేవనెత్తారు.
ఈ అంశాలపై విచారణ అధికారులను ప్రశ్నించారు. అధికారులు ఈ అంశాలపై దాటవేద ధోరణి ప్రద ర్శించారు.స్మశానవాటిక నిర్మాణం విషయంలో మాజీ కార్యదర్శి రాష్ట్ర ఆర్థిక సం ఘం నిధులనుండి అడ్వాన్సు కింద తీసుకు న్న 1,50,000 రూపాయలు తిరిగి పంచాయతీకి చెల్లించటం ఈ విచారణలో జరిగిన ఏకైక సానుకూల అంశమైంది.ఈ విచారణ జిల్లా డి ఆర్ డి ఎ అసిస్టెంట్ ప్రాజెక్ట్ డైరెక్టర్ ( ఏపీడీ ) సమక్షంలో జరుగగా.. జిల్లా డివిజనల్ పంచాయతీ అధికారి( డిఎల్పిఓ ), మానకొండూర్ మండల ఎంపీడీవో ఎంపీ ఓ, మాజీ పంచాయితీ కార్యదర్శులు ప్రేమ్ కుమార్, సుష్మిత, మాజీ, తాజా టెక్నికల్ అ సిస్టెంట్లు, పంచాయతీ రాజ్ శాఖ ఏ ఈ ఈ లు, పంచాయతీ పాలకవర్గం, ఇతరులతో పాటు 50కి పైగా గ్రామస్థులు హాజరయ్యారు.
కొసమెరుపు
నోటీసులు అందుకున్న ప్రతి అధికారి, హాజరైన బహిరంగ విచారణ గ్రామంలో జ రిగినప్పటికీ, నిజానికి తమ విచారణ రిపోర్టును అధికారులు డి ఆర్ డి ఎ పి డి ద్వారా రాష్ట్ర కమిషనర్ కు ఈ నెల 7వ తేదీనే పం పారు. తిరిగి ఆ విచారణ రిపోర్టును ఫిర్యాదుదారుడు గోపాల్ రెడ్డికి రాష్ట్ర గ్రామీణా భివృద్ధి శాఖ కమిషనర్ 13 వ తేదీనే పం పారు. అయితే ఆ విచారణ రిపోర్టులో అం శాలు ప్రశ్నార్థకంగా, సమర్పించిన ఆధారాలకు అనుగుణంగా లేవని ఫిర్యాదుదారుడు గోపాల్ రెడ్డి అభ్యంతరాలు వ్యక్తం చేశారు.
తాను చేసిన ఫిర్యాదును అధికారులు ముగించినట్లు ఆయన తెలుపగా, మరి అధికారులు ఈ ఎంక్వయిరీ ఎందుకు చేశారో, ఈ దాగుడుమూతలు తనతో ఎందుకు ఆడుతున్నారో అర్థం కావట్లేదని ఫిర్యాదుదారు వాపోయారు. న్యాయం కోసం ఎందాకైనా వెళ్లేందుకు తాను సిద్ధంగా ఉన్నట్లు స్పష్టం చేశారు.






