calender_icon.png 21 July, 2025 | 5:42 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అజాతశత్రువు దత్తన్న

21-07-2025 01:54:38 AM

రాజకీయాలకు అతీతంగా స్ఫూర్తిమంతమైన వ్యక్తి 

తెరిచిన పుస్తకం ఆయన జీవితం

- ‘అలయ్ అందరికీ ఆప్తుడు

- ఆయనది లౌకికవాదం.. పాటించేది మత సామరస్యం

- అక్కడ వాజ్‌పేయి.. ఇక్కడ దత్తాత్రేయ

- పదవి ఉన్నా, లేకున్నా.. గౌరవం తగ్గని నాయకుడు

- గౌలీగూడ గల్లీ నుంచి హర్యానా గవర్నర్ దాకా..

- ఆయన సుదీర్ఘ రాజకీయ ప్రయాణం.. ఎందరికో ఆదర్శప్రాయం

హైదరాబాద్, జూలై 20 (విజయక్రాంతి): స్వార్థం కోసం రాజకీయం చేసే ప్రస్తుత సమాజంలో సిద్ధాంతం కోసం కట్టుబడే నాయకులు ఉండటం చాలా అరుదు. రాజకీయ విలువలు రోజురోజుకూ దిగజారిపోతున్నాయని అందరూ భావిస్తున్న తరు ణంలోనూ గత తరం సంప్రదాయ రాజకీయాలకు నిలువెత్తు నిదర్శనంగా నిలిచే నాయకులూ మచ్చుకు లేకపోలేదు.

కులాలకు, మతాలకు, ప్రాంతాలకు, పార్టీలకు అతీతంగా రాజకీయాలు నెరుపుతూ అందరి నుంచి గౌరవం పొందే నాయకులూ ఉండ టం విశేషమే. అలాంటి అరుదైన నాయకుల్లో ఒకరు..అజాత శత్రువు బండారు దత్తాత్రేయ. గౌలిగూడ నుంచి మొదలైన దత్తన్న రాజకీయ ప్రస్థానం, జాతీయ నేతగా ఆయన ఎదిగిన తీరు నేటితరానికి ఎంతో స్ఫూర్తిదాయకం. 

అక్కడ వాజ్‌పేయి..ఇక్కడ దత్తన్న..

తెలంగాణ రాష్ట్ర రాజకీయ చరిత్రలో అజాత శత్రువు అనే పదం తలచుకోగానే యాదికొచ్చే పేరు బండారు దత్తాత్రేయ. అందుకే దత్తాత్రేయను అందరూ ముద్దుగా, హక్కుగా.. దత్తన్న అని పిలుచుకుంటారు. శత్రువు, ప్రత్యర్థి అనేవారు దత్తాత్రేయ డిక్షనరీలోనే లేరు. ప్రతి ఒక్కరికీ ఆయన సన్నిహితుడే. బెంజ్ కారులో తిరిగినా గంజి మనిషిలాగానే ఉండే సామాన్యమైన వ్యక్తి దత్తాత్రే య. నమ్మిన సిద్ధాంతాలకు ఇప్పటికీ కట్టుబడి ఉన్న నాయకుడు.

దేశస్థాయిలో అటల్ బిహా రీ వాజ్‌పేయికి ఉన్నంత గౌరవం రాష్ట్రంలో దత్తన్న సొంతం. పదవిలో ఉన్నా, లేకున్నా జాతీయ స్థాయిలో దత్తాత్రేయను రాజకీయాలకు అతీతంగా గౌరవిస్తారు. రాజకీయ విభేదాలు సిద్ధాంతాలకే పరిమితం కావాలని విశ్వసించే వ్యక్తి దత్తాత్రేయ. ఆయ న జీవితం ఒక తెరచిన పుస్తకం వంటి ది. ఎంత ఉన్నత స్థాయి ఎదిగినా కార్యకర్త పిలి స్తే గల్లీలో పాన్ షాపు ఓపెనింగ్‌కు కూడా వెళ్లే వ్యక్తిత్వం. ప్రజలకు నిత్యం అందుబాటులో ఉంటూ.. వారికోసం తపిస్తున్న నేత ల్లో బండారు దత్తాత్రేయ ముందు వరసలో ఉంటారు.

తెలంగాణ ఉద్యమ స్ఫూర్తి ‘అలయ్

ప్రేమ, ఆత్మీయత, ఐక్యత చాటిచెప్పాలన్న లక్ష్యంతో రాజకీయాలతో సంబంధం లేకుం డా 2005లో ‘అలయ్ కార్యక్రమా న్ని దత్తన్న ప్రారంభించారు. ప్రతిఏటా నిర్వహించే అలయ్ తెలంగాణ ఉద్యమానికి ఎంతో స్ఫూర్తి ఇచ్చింది. ఆయనది పేరుకు హిందూత్వం, మతం భారతీయం.

దత్తన్న కోరుకునేది జనహితం, ఆయనది లౌకిక వాదం, ఆయన పాటించేది మత సామరస్యం. అలయ్ కార్యక్రమం తో అన్ని వర్గాలను, పార్టీలను ఒకే వేదికపైకి తీసుకొచ్చిన ఘనత దత్తాత్రేయకే దక్కుతుం ది. ఉత్తర, దక్షిణ భారత్ ప్రజలతో మమేకమైన రాజకీయ ప్రస్థానం దత్తన్న సొంతం. 

ఆర్‌ఎస్‌ఎస్ నుంచి ఇప్పటిదాకా..

1965లో ఆర్‌ఎస్‌ఎస్‌లో సేవక్ సంఘ్‌గా చేరడంతో దత్తన్న రాజకీయ ప్రయాణం మొదలైంది. ప్రచారక్, విభాగ్ ప్రచారక్ బా ధ్యతలు నిర్వర్తించారు. ఎమర్జెన్సీ సమయం లో ఎంఐఎస్‌ఏ కింద అరెస్టు కూడా అయ్యా రు. 1980లో బీజేపీలో ఉమ్మడి ఏపీకి కార్యదర్శిగా నియమితులైన దత్తన్న 1991లో మొదటిసారి లోక్‌సభకు ఎన్నికయ్యారు.

ఆ తర్వాత 1996లో ఏపీ బీజేపీ ఏపీ రాష్ట్ర అధ్యక్షుడిగా నియమితులయ్యారు. 1998లో రెండోసారి, 1999లో మూడోసారి ఎంపీగా ఎన్నికై కేంద్రమంత్రిగా కూడా పనిచేశారు. వివిధ శాఖలకు కేంద్ర మంత్రిగా వ్యవహరించడంతోపాటు, 2004నుంచి 2006 వరకు బీజేపీ జాతీయ కార్యదర్శిగా వ్యవహరించా రు.

2013 నుంచి -2014 వరకు బీజేపీ జాతీ య ఉపాధ్యక్షుడిగా, జాతీయ మ్యానిఫెస్టో కమిటీ సభ్యుడిగా బాధ్యతలు నిర్వర్తించారు. 2014లో నాల్గోసారి 16వ లోక్‌సభకు ఎన్ని కై 2017 వరకు మరోసారి కేంద్ర కార్మిక, ఉపాధి శాఖ మంత్రిగా వ్యవహరించారు. 2019 నుంచి 2021వరకు హిమాచల్‌ప్రదేశ్ గవర్నర్, ఆ తర్వాత హర్యానా గవర్నర్‌గా ఎంతో ఆదర్శవంతంగా, పదవికే వన్నె తీసుకొచ్చేలా బాధ్యతలను నిర్వర్తించారు.

గల్లీ నుంచి గవర్నర్ దాకా..

గౌలిగూడ గల్లీ నుంచి హర్యానా గవర్నర్ వరకు దత్తాత్రేయ చేసిన సుదీర్ఘ రాజకీయ ప్రయాణమే ఆయన సాధించిన ఘనత. జీవితంలో ఎన్నో పదవులు అధిరోహించినా ఎప్పుడూ ప్రజలకు దూరం కానీ వ్యక్తిత్వం ఆయ నది. కొత్తగా రాజకీయాల్లోకి రావాల నుకునే వారు దత్తాత్రేయ ప్రయాణం ఒక జీవిత పాఠం.

అతి సామాన్య కుటుంబం నుంచి వచ్చిన దత్తాత్రేయ అనేక ఆటుపోట్లు ఎదుర్కొని అత్యున్న త రాజ్యాంగ పదవి చేపట్టారు. రాజకీ యాలు వృత్తి, వ్యాపారం కోసం కాకుం డా సమాజం కోసమేనని నమ్మే వ్యక్తి దత్తన్న. నిరంతరం సమాజం కోసం పనిచేయాలని, పేదల వృద్ధికి కష్టపడా లని ఆకాంక్షిస్తారు. కార్యకర్తలే ఆయన ఆస్తిగా భావిస్తారు.