calender_icon.png 21 July, 2025 | 10:59 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

విద్యుత్ అధికారుల నిర్లక్ష్యంతో ప్రమాదం

21-07-2025 05:37:35 PM

నల్గొండ మండలం అన్నారెడ్డి గూడెంలో ఘటన..

చెట్లు కొడుతుండగా బండిపై వెళ్తున్న వారిపై విరిగిపడ్డ కరెంటు స్తంభం..

రెండు రోజులైనా స్పందించని విద్యుత్ అధికారులు..

విద్యుత్ అధికారుల నిర్లక్ష్యంపై ఆగ్రహం వ్యక్తం చేసిన మాజీ ఎమ్మెల్యే కంచర్ల..

నల్లగొండ టౌన్ (విజయక్రాంతి): విద్యుత్ అధికారుల నిర్లక్ష్యంతో ప్రమాదం జరిగింది. రోడ్డుకు ఇరువైపులా చెట్లు కొడుతుండగా బండిపై వెళ్తున్న వ్యక్తిపై కరెంటు స్తంభం విరిగిపడింది. ఈ ఘటన నల్గొండ మండలం అన్నా రెడ్డి గూడెం గ్రామంలో చోటుచేసుకుంది. వివరాలలోకి వెళితే.. అదే గ్రామానికి చెందిన బత్తుల వెంకటేశ్వర్లు తన భార్య కుమారుడితో ఆదివారం పొలం కాడికి తన బండి మీద వెళుతుండగా అదే సమయంలో విద్యుత్ అధికారులు చెట్లను కొడుతుండగా విద్యుత్ స్తంభం విరిగి ఈ క్రమంలో బండిపై ప్రయాణిస్తున్న బత్తుల వెంకటేశ్వర్లుపై  పడింది. దీంతో ప్రయాణిస్తున్న ముగ్గురు వ్యక్తులకు తీవ్ర గాయాలయ్యాయి. దీంతో గ్రామస్తులు వారిని నల్లగొండ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. ఈ విషయం తెలుసుకున్న నల్గొండ మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి సోమవారం హాస్పిటల్ కి చేరుకొని వారిని పరామర్శించారు.

ఇంతవరకు విద్యుత్ సంస్థకు చెందిన అధికారులు ఎవరూ తమ పరామర్శించలేదని కంచర్లకు తెలిపారు. దీంతో వెంటనే స్పందించిన కంచర్ల  విద్యుత్ ఉన్నతాధికారులతో ఫోన్లో సంభాషించి విద్యుత్ అధికారుల నిర్లక్ష్య పట్ల తన తీవ్ర అగ్రహాన్ని వ్యక్తం చేశారు. కనీస మానవత్వం లేకుండా తమ నిర్లక్ష్యం వల్ల తీవ్ర గాయాల బాధ తో హాస్పిటల్లో చికిత్స పొందుతున్న బాలుని పరామర్శించకపోవడం పట్ల తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. తక్షణమే విద్యుత్ అధికారులు బాధితులను పరామర్శించి వారి చికిత్సకయ్యే ఖర్చులు భరించి వారికి విద్యుత్ సంస్థ ద్వారా ఆర్థిక సహాయం అందించాలని కోరారు. అదేవిధంగా హాస్పిటల్ డాక్టర్లతో మాట్లాడి మెరుగైన చికిత్స అందించాల్సిందిగా కోరారు. పరామర్శించిన వారిలో మండల పార్టీ అధ్యక్షుడు దేప వెంకటరెడ్డి పట్టణ పార్టీ అధ్యక్షులు బోనగిరి దేవేందర్ మాజీ ఎంపీపీ నారబోయిన బిక్షం, మాజీ సర్పంచ్ రాము బీరం గోపాల్ రెడ్డి తదితరులు పరామర్శించిన వారిలో ఉన్నారు.