01-01-2026 02:28:16 AM
నాగిరెడ్డిపేట్, డిసెంబర్ 31 (విజయక్రాంతి): యాసంగిలో నారుమడి యజమాన్యులు రాత్రి వేళలో నీరు నిండుగా ఉంచి తెల్లవారుజామున తీసివేసి కొత్త నీరు పెట్టాలని ఏవో సాయికిరణ్ తెలిపారు.ఈ సందర్భంగా ఏవో సాయికిరణ్ మాట్లాడుతూ...చలి సమస్యను అధికమించడానికి నారుమల్లపైన ఇనుప చూవ్వలు వెదురు కర్రలతో ఊతం ఇచ్చి పైన పలుచని పాలిథిన్ షీట్ లేదా యూరియా బస్తలతో తయారుచేసిన పట్టాలతో సాయంత్రం వేళలో కప్పి ఉంచి మరుసటి రోజు ఉదయాన్నే తీసివేయాలన్నారు.
మంచు కురుస్తున్నప్పుడు ఆకులపై బురద చల్లాలని,జింకు లోపా సవరణకు లీటర్ నీటికి రెండు గ్రాముల జింకు సల్ఫేట్ కలిపిన ద్రావణాన్ని పిచికారి చేయాలని అన్నారు.ఆరోగ్యంగా పెరగడానికి పైపాటుగా రెండు కేజీల యూరియా రెండు గ్రాముల కార్బనుడాజీన్+మం కోజెబ్ మిశ్రమ మందును కలిపి వేసుకోవాలన్నారు.పై పాటుగా 19:19:19:4-5 గ్రామ్స్ లీటర్ పిచికారి చేసుకోవాలి అన్నారు. ఇసబిఒన్ 1.0-1.5 ఎమ్మెల్/లీటర్ అభియోటిక్ మరియు అయోటిక్ తగ్గించడంలో సహాయ పడుతుందన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ చిలుకూరు జ్యోతి సురేందర్ రెడ్డి,మాజీ సర్పంచ్ సుభాకర్ రెడ్డి,రైతులు పాల్గొన్నారు.