calender_icon.png 1 January, 2026 | 8:15 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

తప్పతాగి రోడ్డుపై వాహనం నడిపితే తప్పదు శిక్ష

01-01-2026 02:29:53 AM

31 నైట్ యువకులు ప్రజలు మద్యం మత్తులో పోలీసులకు చిక్కితే అంతే సంగతి 

మున్సిపల్ పట్టణంలో అంబేద్కర్ చౌరస్తా వద్ద సహారా కాస్తున్న పోలీసులు 

ఎల్లారెడ్డి, డిసెంబర్ 31 (విజయక్రాంతి): ప్రజలు తమ కుటుంబాలతో సుఖ సంతోషాలతో గడపాలని అనవసరంగా ఆరుబయట మద్యం సేవించి పోలీసుల చేతులకు చిక్కి శిక్షలు అనుభవించకూడదని జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర ఆదేశానుసారం ఎల్లారెడ్డి ఎస్త్స్ర మహేష్ ఆధ్వర్యంలో ఎల్లారెడ్డి పట్టణంలో పోలీసులు పలు వీధుల్లో పట్టణ కూడలిలో పహారా కాస్తున్నారు. 31 నైట్ మద్యం సేవించి రహదారిపై వాహనాలు నడుపుతే వారు ఎవరైనా సరే శిక్షకు అర్హులేనని ఎస్త్స్ర మహేష్ కుమార్ అన్నారు.

అంబేద్కర్ చౌరస్తాలో వాహనాల తనిఖీ టు వీలర్ త్రీ వీలర్ ఫోర్ వీలర్ అన్ని వాహనాలను ఎల్లారెడ్డి పోలీస్ సిబ్బంది కానిస్టేబుల్ ముమ్మరంగా ప్రతి వాహనాన్ని వదలకుండా పకడ్బందీగా వాహనాలను తనిఖీ నిర్వహించారు. వాహనాల తనిఖీలు ప్రతి ఒక్కరి వాహనంను తనిఖీ చేసి మద్యం సేవించినట్లు తెలుసుకోవడానికి పోలీసులు ఉపయోగించే పరికరాన్ని బ్రీత్ అనలైజర్  లేదా ఆల్కహాల్ బ్లో డ్రైవ్, ఇది శ్వాసలో ఉన్న ఆల్కహాల్ శాతాన్ని కొలుస్తుంది, మరియు ఇది డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలలో ముఖ్యమైన సాధనంతో ఎక్కడ చూసినా తనికిలే నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమంలో ఎల్లారెడ్డి పోలీస్ కానిస్టేబుల్, అమర్, సాయి కిరణ్, బాలకృష్ణ, నరేందర్ పాల్గొన్నారు.