8 May, 2026 | 1:05 AM

యువత స్వశక్తితో ఎదగాలి

08-05-2026 12:11 AM

ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ, దుబ్బాక కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ చెరుకు శ్రీనివాస్ రెడ్డి

చేగుంట, మే 7 (విజయక్రాంతి) : చదువుకున్న యువత ఉద్యోగాల కోసం ఎదురుచూడకుండా స్వశక్తితో ఎదిగి, నలుగురికి ఉపాధి అవకాశాలు కల్పించే స్థాయికి చేరుకోవాలని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ, దుబ్బాక కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ శ్రీనివాస్ రెడ్డి సూచించారు. చేగుంట మండల పరిధిలోని వడియారం ప్రధాన రహదారిపై నూతనంగా ఏర్పాటు చేసిన ఎస్‌ఎంపి రెస్టారెంట్ను గురువారం వారు కలిసి ప్రారంభించారు.

ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ వెంగల్ రావు, మండల కాంగ్రెస్ అధ్యక్షుడు వడ్ల నవీన్ కుమార్, వడియారం సర్పంచ్ సాయికుమార్ తదితరులు పాల్గొన్నారు.ఈ సందర్భంగా షబ్బీర్ అలీ మాట్లాడుతూ యువతలో ఆత్మవిశ్వాసం, పట్టుదల ఉంటే స్వయం ఉపాధి రంగంలో ఎన్నో అవకాశాలు ఉన్నాయని తెలిపారు. చిన్న స్థాయిలో ప్రారంభించిన వ్యాపారాలు భవిష్యత్తులో పెద్ద స్థాయికి ఎదగవచ్చని అన్నారు. ప్రభుత్వం కూడా యువ పారిశ్రామికవేత్తలకు ప్రోత్సాహకాలు అందిస్తోందని పేర్కొన్నారు.

శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో కొత్త వ్యాపార సంస్థలు ప్రారంభించడం వల్ల స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు పెరుగుతాయని తెలిపారు. వ్యాపార రంగంలో ముందుకు రావాలనే ఆలోచనతో యువత కృషి చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మసాయిపేట్ శ్రీనివాస్, జనరల్ సెక్రటరీ శ్రీనివాస్, మార్కెట్ కమిటీ డైరెక్టర్ మొహమ్మద్ ముజామిల్, కాషాబోయిన శ్రీనివాస్, బల్ రెడ్డి, స్టాలిన్ నర్సిములు, ఉపసర్పంచ్ రఫీ, చౌదరి శ్రీనివాస్, వార్డు సభ్యులు, మండల నాయకులు సండ్రుగు శ్రీకాంత్, రాజా గౌడ్ తదితరులు పాల్గొన్నారు.