8 May, 2026 | 1:03 AM

వరదల నివారణ చర్యలపై ప్రణాళికతో ముందుకు వెళ్లాలి

08-05-2026 12:10 AM

జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా

నిర్మల్ మే 7 (విజయ క్రాంతి): రాబోయే వర్షాకాలాన్ని దృష్టిలో ఉంచుకుని వరదల నివారణ, ప్రత్యేక ప్రణాళికతో ముందుకు వెళ్తున్నట్టు కలెక్టర్ భవేశ్ మిశ్రా, ఎస్పీ జానకి షర్మిల తెలిపారు. గురువారం వివిధ శాఖల జిల్లా అధికారులు సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా జిల్లాలో వర్షాకాలానికి ముందస్తుగా చేపట్టాల్సిన చర్యలు, వరదల సమయంలో తక్షణ స్పందన, ప్రజల రక్షణ, సహాయక చర్యలు, అత్యవసర సేవల సమన్వయంపై విస్తృతంగా సమీక్షించారు.

జిల్లాలోని లోతట్టు ప్రాంతాలు, వరద ముప్పు ఉన్న గ్రామాలు, చెరువులు, వాగులు, కాలువలు, రహదారుల పరిస్థితులను నిరంతరం పర్యవేక్షించాలని అధికారులను కలెక్టర్ ఆదేశించారు.వర్షాకాల సన్నద్ధతలో భాగంగా నిర్మల్ జిల్లాలో జిల్లా స్థాయి ఫ్లడ్ మాక్ ఎక్స్సజ్ నిర్వహించనున్నట్లు కలెక్టర్ తెలిపారు. ఈ మాక్ ఎక్స్సజ్ ద్వారా వరదల సమయంలో తీసుకోవాల్సిన అత్యవసర చర్యలను ప్రాయోగికంగా అమలు చేసి శాఖల మధ్య సమన్వయాన్ని పరీక్షించనున్నట్లు పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో రెవెన్యూ, పోలీస్, అగ్నిమాపక శాఖ, వైద్య ఆరోగ్య శాఖ, పంచాయతీరాజ్, ఇరిగేషన్, మున్సిపల్ పరిపాలన, విద్యుత్, గ్రామీణ నీటి సరఫరా శాఖలతో పాటు ఇతర అత్యవసర సేవల విభాగాలు పాల్గొంటాయని తెలిపారు. ప్రజల తరలింపు ప్రక్రియ, సహాయక శిబిరాల ఏర్పాటు, రక్షణ చర్యలు, కమ్యూనికేషన్ వ్యవస్థలు, అత్యవసర పరిస్థితుల్లో స్పందన విధానాలను సమగ్రంగా పరిశీలించనున్నట్లు వెల్లడించారుఈ కార్యక్రమంలోఅదనపు కలెక్టర్లు బి వెంకటేశ్వర్లు, కిషోర్ కుమార్, సబ్ కలెక్టర్ సంకేత్ కుమార్, ఆర్ డి ఓ రత్న కళ్యాణి, సంబంధిత శాఖల అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

జిల్లాలో వేగంగా జనగణన ప్రక్రియ

  • జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా

నిర్మల్. మే 7 ( విజయ క్రాంతి): జిల్లాలో డిజిటల్ జనగణన-2027 ప్రక్రియ పకడ్బందీగా సాగుతోందని జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా వెల్లడించారు. గురువారం హైదరాబాద్ నుండి డైరెక్టర్ ఆఫ్ సెన్సస్ భారతి హోలికేరి జనగణన - 2027 విధివిధానాలు, సంబంధిత అంశాలపై జిల్లా కలెక్టర్లు, అదనపు కలెక్టర్లు, జిల్లా అధికారులకు నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ లో కలెక్టరేట్ విసి హాల్ నుండి ఆయన జిల్లా అధికారులతో కలిసి పాల్గొన్నారు.

ఈ సందర్భంగా కలెక్టర్ జిల్లా నివేదికను వివరిస్తూ, జిల్లాలో ఇప్పటివరకు 93.844 శాతం స్వయం గణన పూర్తయిందని,ఇప్పటి వరకు 12897 విజయవంతంగా ముగిశాయని వివరించారు. జనగణన విధుల్లో పాల్గొనే సిబ్బంది శిక్షణపై ప్రత్యేక దృష్టి సారించి, జిల్లావ్యాప్తంగా ఏర్పాటు చేసిన 44 శిక్షణా బ్యాచ్లు వంద శాతం లక్ష్యాన్ని చేరుకున్నాయని వివరించారు.

క్షేత్రస్థాయి నిర్వహణకు కీలకమైన 1551 హౌస్ లిస్టింగ్ బ్లాక్ డీమార్కేషన్ ప్రక్రియను ఆన్లైన్ పోర్టల్లలో వంద శాతం పూర్తి చేసినట్లు తెలిపారు. ఎన్యుమరేటర్లు, సూపర్వైజర్లకు అవసరమైన కిట్ల పంపిణీ వేగంగా జరుగుతోందనీ తెలిపారు.ఈ వీడియో కాన్ఫరెన్స్ లో అదనపు కలెక్టర్లు బి. వెంకటేశ్వర్లు, కిషోర్ కుమార్, సి పి ఓ జీవరత్నం, ఇతర అధికారులు, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.