యువత బెట్టింగ్‌కు దూరం ఉండాలి
జహీరాబాద్, ఏప్రిల్ 1: యువత క్రికెట్ బెట్టింగులకు దూరంగా ఉండాలని జహీరాబాద్ రూరల్, ఝరాసంగం, హద్నూరు, కో హిర్, చిరాకుపల్లి ఎస్‌ఐ లు కాశీనాథ్ పటేల్, క్రాంతి కుమార్, దోమ సుజిత్, టి నరేష్, రాజేందర్ రెడ్డి లు వేరువేరుగా యువతకు సూచించారు. క్రికెట్ బెట్టింగ్ వల్ల డబ్బులు కోల్పోయి అప్పుల పాలవుతారని తెలిపారు. తల్లిదండ్రులు సంపాదించిన సంపదను క్షణకాలంలోనే బెట్టింగ్ లో కోల్పోతారని, తద్వా రా బెట్టింగ్ ఆడిన వారు జీవితాన్ని కోల్పోతారని వారు తెలిపారు.
క్రికెట్ బెట్టింగ్ ఆడ డం చట్టరీత్యా నేరమని, యువత, విద్యార్థు లు తెలుసుకోవాలని వారు వివరించారు. ఎవరైనా క్రికెట్ బెట్టింగ్ లో పాల్గొన్న వారి సమాచారాన్ని అందించినట్లయితే వారి పేరును గోప్యంగా ఉంచడం జరుగుతుందని తెలిపారు. యువత చెడు మార్గమున నడవకుండా మంచి మార్గంలో నడిచి పేరు ప్రా ఖ్యాతలు సంపాదించాలని వారు తెలిపారు. ఎవరైనా అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడితే 100 నెంబర్ కు ఫోన్ చేయాలని వారు పేర్కొన్నారు.




