2 April, 2026 | 2:54 AM

మల్లన్న సమక్షంలో టీఆర్పీలో చేరికలు

02-04-2026 01:20 AM

హైదరాబాద్, ఏప్రిల్ 1 (విజయక్రాంతి): సిరిసిల్ల జిల్లా బీజేపీకి చెందిన పలువురు సీనియర్ నాయకులు బుధవారం టీఆర్పీలో పార్టీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న సమక్షంలో ఆ పార్టీలో చేరారు. జిల్లా అధ్యక్షుడు దండు వినోద్ ఆధ్వర్యంలో ఈ చేరి కలు జరిగాయి. పార్టీలో చేరిన వారిలో బీజేపీ సీనియర్ నాయకులు గుండ శ్రీకాంత్, అమరగొండ అజయ్, ఇమ్మడిశెట్టి వినోద్, మహేష్ ఉన్నారు.

ఈ సందర్భంగా తీన్మార్ మల్లన్న మాట్లాడుతూ.. పార్టీ బలోపేతానికి, ప్రజా సమస్యల పరిష్కారానికి మరియు బీసీ రాజ్యాధికార స్థాపన కొరకు టీఆర్పీ కట్టుబడి ఉందని తెలిపారు. ప్రజల ఆశయాలకు అనుగుణంగా పనిచేసే నాయకులకు టీఆర్పీలోకి ఎప్పుడూ స్వాగతం ఉంటుందని స్పష్టం చేశారు. ఈ చేరికలతో సిరిసిల్ల జిల్లాలో టీఆర్పీ మరింత బలపడిందని, రాబోయే రోజుల్లో పార్టీ ప్రభావం మరింత పెరుగుతుందని నాయకులు ఆశాభావం వ్యక్తం చేశారు.