25-10-2025 08:43:46 PM
ఎల్లారెడ్డి శాసన సభ్యులు మదన్ మోహన్ రావు
గాంధారి మండలంలో పలు అభివృద్ధి పనులు ప్రారంభించిన ఎమ్మెల్యే
గాంధారి,(విజయక్రాంతి): పేద ప్రజల యొక్క అభివృద్దె నా దేయం అని ఎల్లారెడ్డి శాసన సభ్యులు మదన్ మోహన్ రావు అన్నారు. ఈ మేరకు శనివారం రోజున గాంధారి మండలంలోని హేమ్ల నాయక్ తండ, సర్వాపూర్, పోతంగల్ కాలాన్, ప్రీస్కూల్ గుట్ట తండా గ్రామాలలో గ్రామపంచాయతీ భవనాలను ప్రారంభోత్సవము శంకుస్థాపనలు చేయడం జరిగింది. దీనితోపాటు పేర్ సంగం గుర్జాల గ్రామాలలో గోదాం లను ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన సమావేశంలో మాట్లాడుతూ గాంధారి మండల అభివృద్ధి దేంగా పనిచేస్తున్నానని ఎల్లారెడ్డి నియోజకవర్గాన్ని తెలంగాణ రాష్ట్రంలోనే ఆదర్శ నియోజకవర్గంగా అన్నారు. పత్తి గ్రామానికి సమాన అభివృద్ధి అందించడమే కాంగ్రెస్ పార్టీ లక్ష్యమని గ్రామపంచాయతీ భవనాలు ప్రజల అవసరాలకు ఉపయోగపడతాయని ఆయన అన్నారు. దీనితోపాటు గౌరారం గ్రామంలో అంగన్వాడి భవనాన్ని ప్రారంభించారు. గ్రామీణ ప్రాంతాలలో చిన్నపిల్లల శ్రేయస్సు కోసం అంగన్వాడి కేంద్రాలు కీలకపాత్ర వహిస్తాయని ఆధునిక సౌకర్యాలతో ఈ భవనం నిర్మాణం ఎంతగానో ఉపయోగపడుతుందని ఎమ్మెల్యే అన్నారు.
ఎల్లప్పుడూ ప్రజా శ్రేయస్సు కోసమే నిన్ను పాటుపడతానని ఎల్లారెడ్డి నియోజకవర్గ ప్రజలే నాకు దశ దిశ అని అన్నారు అనంతరం పలు గ్రామాలలో వివిధ కారణాలతో మృతి చెందిన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల కుటుంబాలను పరామర్శించి ఆర్థిక సహాయాన్ని అందజేశారు. గౌరారం గ్రామంలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్త గైని బాలరాజ్ అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న విషయాన్ని తెలుసుకొని 50 వేల ఆర్థిక సహాయాన్ని అందజేశారు ఆయన వెంట కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు సితాయపల్లి శ్రీనివాస్ సొసైటీ చైర్మన్ సాయికుమార్ గాంధారి మార్కెట్ కమిటీ చైర్మన్ పరమేశ్వర్, మండల నాయకులు తూర్పు రాజులు తాడ్వాయి సంతోష్ కామెడి బాలరాజ్, లైన్ రమేష్ అహ్మద్ మదహర్ కాంతి రెడ్డి తోపాటు కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు