జుట్టు రాలిపోతుంటే

29-04-2024 12:10:00 AM

జుట్టు రాలడానికి చాలా కారణాలు ఉన్నాయి. అందులో పోషకాలు తీసుకోకపోవడం, జుట్టుకి వాడే ఉత్పత్తుల్లో కెమికల్స్ ఉండడం, ఒత్తిడి, హార్మోన్ల లోపాలు ఇలా చాలానే ఉన్నాయి. అయితే, ఈ సమస్యకి కొన్ని ఇంటి చిట్కాలతో చెక్ పెడదాం.  కొబ్బరిపాలలో పోషకాలు ఉంటా యి. ఇవన్నీ కూడా జుట్టు మూలాలని బలంగా చేస్తాయి. వీటిని అప్లై చేయడం వల్ల జుట్టు మృదువుగా మారుతుంది. ఈ పాలు అప్లై చేస్తే తెల్ల జుట్టు సమస్య తగ్గుతుంది. పొడి జుట్టు ఉన్నవారు ఈ ప్యాక్  ట్రై చేయొచ్చు.

కొబ్బరిపాలలో హెల్దీ ఫ్యాట్స్ జుట్టు ఆరోగ్యానికి చాలా మంచివి. కొబ్బరి నూనె  జుట్టు ఆరోగ్యానికి చాలా మంచిది. కొబ్బరి పాలు కూడా  ఈ సమస్యకి చక్కని పరిష్కారమని చెప్పొచ్చు. కొబ్బరిపాలని తలకి అప్లై చేసి అరగంట పాటు ఉండాలి. వారానికి కనీసం రెండు రోజులు ఇలా చేస్తే రిజల్ట్ ఉంటుంది.  కొబ్బరిపాలు, అలోవెరా జెల్ కాంబినేషన్ కూడా జుట్టు రాలడాన్ని తగ్గిస్తుంది. అందుకోసం కొబ్బరిపాలలో అలోవెరా జెల్ కలిపి బాగా మిక్స్ చేయండి. దీనిని జుట్టుకి అప్లై చేయండి. అవసరమనుకుంటే గుడ్డు కూడా వేయొచ్చు. ఇందులో కొద్దిగా నిమ్మరసం కలిపి రాస్తే దీనికి మించిన హెయిర్ ప్యాక్ ఉండదు.