వేసవిలో ప్రయాణమా.. జాగ్రత్త

29-04-2024 12:05:00 AM

ఎండాకాలం అనగానే ఏదో ఒకరకంగా ప్రయాణాలు చేయాల్సి వస్తూనే ఉంటుంది. ఒక పక్క వేడి తగులుతున్నా సమ్మర్‌లోనే ఎక్కువగా ప్రయాణాలు తగులుతూ ఉంటాయి. పెళ్లిళ్లు, శుభ కార్యాలు, చిల్లింగ్ టూర్స్ ఇలా ఎక్కడికో ఒక చోట ప్రయాణాలు ఉంటాయి. వేసవిని ఎంజాయ్ చేయడానికి దూర ప్రయణాలు వెళ్లటం మామూలే. అయితే ఈ ఎండల్లో ప్రయాణం అంటే మాటలు కాదు. ఎంతో జాగ్రత్తగా ఉండకపోతే నేరుగా హాస్పిటల్లోకి వెళ్లాల్సి వస్తుంది. 

డీ హైడ్రేషన్ 

ఎండ వేడికి చెమటలతో బాటు శరీరంలోని నీరు, ఖనిజలవణాలు కూడా బయటకు వెళ్లిపోతాయి. కాబట్టి ఎప్పుడూ నీళ్లు తాగుతూ ఉండాలి. మధ్యమధ్యలో ఎనర్జీ డ్రింక్స్, ఫ్రూట్ జ్యూసులు, కొబ్బరి నీళ్లు ఇలా ఏవో ఒకటి తీసుకుంటూ ఉంటే బాడీ డీ హైడ్రేట్ కాకుండా ఉంటుంది. శరీరంలో నీటి శాతం తగ్గుతుంటే శరీరం మరింతగా బలహీన పడుతుంది. సాధ్యమైనంత వరకూ ఎండల్లో కూల్ డ్రింక్స్ జోలికి వెళ్లకపోతేనే మంచింది. 

స్కిన్ కేర్  

ఎండలకి చర్మం దెబ్బ తినే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి మీరు బయటకు వెళ్లినప్పుడుల్లా ఖచ్చితంగా సన్ స్క్రీన్ లోషన్స్ రాసుకోవడం మంచిది. అలాగే చర్మంపై నేరుగా ఎండ పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. దీని వల్ల చర్మం ఆరోగ్యంగా ఉంటుంది.  

ఆరోగ్యకరమైన ఆహారం 

ప్రయాణమంటేనే చిరుతిండ్లు అంటారు చాలామంది. అది సహజం కూడా. కానీ ఇక్క డే జాగ్రత్తగా ఉండాలి. అసలే ఎండాకాలం ఆరోగ్యకరమైన ఆహారానికి ప్రాధాన్యమివ్వాలి. నీటిశాతం ఎక్కువగా ఉన్న పండ్లను, కాయలను తీసుకోవాలి. ముఖ్యంగా పుచ్చకాయ, కీరదోస వంటివాటిని ఎంత ఎక్కువ తీసుకుంటే అంతలాభం. వేసవి ప్రయాణాల్లో ఉప్పు ఎక్కువగా ఉండే చిప్స్, నూనెలో వేయించిన పదార్థాలకు దూరంగా ఉండాలి.