11-07-2025 12:00:00 AM
చిన్నబోతున్న రంగుల కళ
నేటికీ వన్నె తగ్గని నైపుణ్యం ఆ కళాకారుల సొంతం
సర్కారు పథకాల ప్రచారంతో కొంత ఊరట
ప్రజలు ఆదరించాలని వేడుకుంటున్న కళాకారులు
మణుగూరు, జులై 10 ( విజయ క్రాంతి ) : మట్టిబొమ్మకు జీవం ఊది మనిషిని చేసినవాడు బ్రహ్మయ్య. కుంచెతో బొమ్మను గీసి ప్రాణం పోసేవాడు చిత్రకారుడు. నేటి ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం అనేక చేతి వృత్తుల ను కనుమరుగు చేసింది .
కంప్యూటర్ లో అక్షరాలను డిజైన్ చేసి వాటిని ఫ్లెక్సీలపై ము ద్రించే యంత్రం రావడంతో కుంచెను నమ్ముకున్న అపర బ్రహలైన కళాకారుల కళకు నేడు ఆదరణ కరువైంది. గత దశాబ్ద కాలంగా చేతిరాతను నమ్ముకొని పొట్ట పోసించుకుంటున్న ఆర్టిస్టులు నేడు ఉపాధి లేక, దమనీయ స్థితిలో ఉన్నారు.
ఫ్లెక్సీల ఎఫెక్ట్..
మార్కెట్లోకి ఫ్లెక్సీలు వచ్చాయి. పీటుకు 50 రూపాయల చొప్పున కలర్ లో ఇవ్వ డం, తక్కువ సమయంలో ఏర్పాటు చేస్తుం డ టంతో ప్రజలు ఫ్లెక్సీలకు ఆదరి స్తున్నారు. దీంతో పెయింటింగ్ ఆర్టిస్టులకు ఉపాధి లే కుండా పోయింది.
గోడపై ఒక సమా చారం రాయడానికి రెండు, మూడు రోజులు పట్టే ది. అయితే ఫ్లెక్సీలతో కేవలం ఒక్క గంటలో నే ఏర్పాటు అవుతుంది. దీంతో ఉపాధి కోల్పోయి పెయింటింగ్ కళాకారులంతా షాపులను సైతం మూసివేశారు. రోడ్డునపడ్డారు. కుటుంబ పోషణ భారమైంది.
చిన్నబోతున్న రంగుల కళముత్యాల్లాంటి అక్షరాలు, రంగురంగులతో రాసి.. చూసే వా రిని మంత్రముగ్ధులను చేసిన వారు నేడు ఉపాధి కరువై కూలీ లుగా బతుకు లీడుస్తు న్నారు. పట్టణంలో ప్రతిభవంతమైన సైన్ బోర్డు ఆర్టిస్టులు, ఆరట్స్ షాపులు ఉన్నాయి. వాటిలో ప్రధానంగా ఫ్రెండ్స్ ఆరట్స్, బాబు ఆరట్స్, స్నేహ ఆరట్స్, సాయిరాం ఆరట్స్, సాయి ఆరట్స్, ఇలాచెప్పుకుంటూ పోతే చాలా ఉన్నా యి.
సైన్ బోర్డు ఆర్టిస్ట్ లు చాలా మంది ఆర్టిస్టులు ఉన్నారు. వీరు ప్రధా నంగా సైన్ బో ర్డులు రాసుకుంటూ, రాజకీయ నాయకుల బ్యానర్లు, స్లోగన్స్ రాసుకుంటూ, వ్యాపార ప్రకటనలు గోడ మీద రాసుకుంటూ జీవ నం సాగించేవారు.వీరి వ్యాపారం కూడా అ ద్భుతంగా జరిగేది.పెయింటింగ్ పై ఆధరణ లేకపోవడంతో కొంత మంది గ్రానైట్ రాతిపై బొమ్మలు వేస్తున్నారు.
ఇళ్ల ముందు పెట్లే నే మ్ ప్లేట్లు, దేవుళ్ల ఫొటోలు, శంకుస్థాపన, ప్రారంభోత్సవాలకు ఉపయోగించే శిలాఫలకాలపై పేర్లను చెక్కుతూ జీవనం సాగిస్తున్నా రు. కళ్లకు కట్టినట్లు గీయడం వారిలోని సృ జనా త్మకతను తెలియజేస్తుంది. శిలలపై బొమ్మలు గీస్తూ ప్రాణం పోస్తున్నారు. అయినప్పటికీ గిరాకీలు లేకపోవడంతో ఆర్థికంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
నైపుణ్యం ఆ కళాకారుల సొంతం
రాజరికం ఉట్టిపడేలా..దరహాసం మురిపించేలా బొమ్మలతో ఎన్నో అందాలకు ప్రా ణం పోసి, వాటికి సజీవ సాక్షాలుగా నిలిచిన చిత్ర కారులు జీవితం నేటి కాలం లో రాళ్లపై చిత్రాలు చెక్కడానికి పరిమితమైంది.నైపు ణ్యం గల ఆ కళాకారుల కళ ఫ్లెక్సీ ప్రింటింగ్ రాకతో చెదిరి, రంగుల కళ కలగానే మారిం ది.
జనం ఆధుని క సాంకేతిక వైపు మొగ్గు చూపడంతో ఈ రంగాన్ని నమ్ముకొని, గతంలో ఆర్టిస్టులు గా పేరు గాం చిన వారు నేడు పని లేక ఇళ్లకు రంగులు, సున్నాలు చేయడానికి వెళుతున్న దుస్థితి నెలకొంది. చేతి రాతలు బాగున్న తలరాత లు ఈ విధంగా మారుతాయని ఊహించలేదని సీనియర్ ఆర్టిస్టు లు వాపోతున్నారు.
పథకాల ప్రచారంతో కొంత ఊరట
కళాకారులకు కొంత మేర ప్రభు త్వ పథకాల ప్రచారంతో ఊరట చెందుతున్నారు. దీ నిలో భాగంగా గోడలపై బొమ్మలు, రైతువేదికల పై ప్రచార హోర్డింగ్లు, డివైడర్లు, ప్రభు త్వ కార్యాలయాల గోడలపై రాతలతో కొంత పని దొరుకు తుంది.
వయస్సుఫై బడిన కళాకారులు కొందరు ఇండ్ల వద్దే తలుపులకు రంగులు వేసుకుని బతుకు ఈడుస్తుండగా.. ఆర్థికం గా నిలదొక్కుకున్న చిత్రకారులు మా త్రం పోటీ ప్రపంచంలో మేము సైతం అం టూ ప్రారంభోత్సవా లకు వేసే శిలాఫలకాలను ప్రస్తు త చిత్రకారులు చెక్కుతున్నారు.
ప్రభుత్వం ప్రోత్సహించాలి.
ప్రభుత్వ కార్యాలయాలు, పాఠశాలలు, కళాశాలలు, ఇతర సంస్థల వారు ఆర్టిస్టుల ద్వారానే బోర్డులు, సూచనలు రాయించే లా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని, తిరిగి కళకు పూర్వ వైభవం తే వాలని కోరారు. అలాగే కళ ను నమ్ముకొని ఆర్టిస్టులుగా ఉన్న సీనియర్లకు ప్ర భుత్వ పెన్షన్లు, డబల్ బెడ్ రూమ్ ఇం డ్లు కల్పిం చాలని విజ్ఞప్తి చేశారు. కుం చెను నమ్ముకున్న జీవితాలకు మళ్లీ పూ ర్వ వైభవం తేవాలని, ప్రజ లందరూ చిత్రకళను ఆదరించి కాపాడాలని సూచించారు.
బాబు,సీనియర్ ఆర్టిస్టు ప్రభుత్వమే ఆదుకో వాలికుడిపూడి
ప్రభుత్వ, ప్రైవేటు విద్యాసం స్థల్లో బోర్డులతో అప్పుడు చేతి నిండా పని ఉండేది. ఇప్పుడు ప్లెక్సీలతో కూడిన బొ మ్మలను ఏర్పాటు చేస్తుండటంతో ఉపా ధి లేకుండా పోయింది. ఆర్థికంగా తీవ్ర ఇబ్బందులు పడుతున్నం. ప్రభుత్వం స్పందించి బ్యాంకుల తో వడ్డీలేని రుణా లు ఇప్పించ డంతో పాటు ఆర్టిస్టులకు ఉపాధి కల్పించి ఆదుకునేందుకు జీవో ను విడుదల చేయాలి. ఆర్టిస్టుల పిల్లలకు విద్యా సంస్థల్లో రాయితీ ఇచ్చేలా చర్య లు తీసుకోవాలి.
శ్రీనివాస్, సీనియర్ చిత్రకారులు