calender_icon.png 11 July, 2025 | 8:29 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

డప్పు కళాకారులకు సౌండ్ బాక్స్ అందజేసిన ఝాన్సీ రాజిరెడ్డి

10-07-2025 11:15:56 PM

తుంగతుర్తి (విజయక్రాంతి): మండల పరిధిలోని వెంపటి గ్రామ ఎస్సీ కాలనీ డప్పు కళాకారులకు దాయం రాజిరెడ్డి చారిటబుల్ ట్రస్ట్ సహకారంతో కామ్రేడ్ దాయం విక్రం రెడ్డి జ్ఞాపకార్థం చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ ఝాన్సీ రాజిరెడ్డి సుమారు రూ.25 వేల విలువ కలిగిన సౌండ్ బాక్స్ ను కాలనీ పెద్దల సమక్షంలో అందజేశారు. ఈ సందర్భంగా పలువురు కాలనీవాసులు మాట్లాడుతూ... నాడు దాయం విక్రం రెడ్డి ప్రజా ప్రతినిధిగా గ్రామాన్ని ఎంతో అభివృద్ధి పరచడమే కాకుండా, ఎస్సీ కొత్త కాలనీ రూపు దాల్చడానికి బీజం వేసి, ఈ యొక్క కాలనీ అభివృద్ధికి ఎంతో దోహదం చేశారని అన్నారు. అదే విక్రం రెడ్డి వారసత్వాన్ని పునికి పుచ్చుకొని రాజకీయంలో కొనసాగుతూ తన తాత రాజిరెడ్డి పేరు మీద చారిటబుల్ ట్రస్ట్ ఏర్పాటు చేసి ఎంతోమందికి సహాయ సహకారం అందిస్తున్నారని తెలియజేస్తూ, ఆ కుటుంబానికి ఎస్సీ కాలనీ ప్రజలు ఎల్లప్పుడూ అండగా ఉంటారని భరోసనిస్తూ, అడగగానే డప్పు కళాకారులకు సౌండ్ బాక్స్ ను అందజేసిన ఝాన్సీ రాజిరెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు.