01-05-2025 01:15:55 AM
వైవిధ్యమైన పాత్రల్లో తనదైన నటనతో స్టార్ హీరో యిన్‌గా ప్రేక్షకుల మెప్పు పొందారు సమంత. ఇప్పుడు నిర్మాతగానూ తనను తాను నిరూపించేందుకు సిద్ధమ య్యారామె. ఆమె సొంత నిర్మాణ సంస్థ ట్రాలాలా మూవింగ్ పిక్చర్స్ పతాకంపై ‘శుభం’ అనే సినిమాను నిర్మించిన సంగతి తెలిసిందే.
ఈ చిత్రాన్ని దర్శకుడు ప్రవీణ్ కండ్రే గుల హారర్ థ్రిల్లర్‌గా రూపొందించారు. ఈ సినిమా మే 9న విడుదల కానుంది. ఈ నేపథ్యంలో ఇటీవల మీడియాతో మాట్లాడిన సమంత పలు ఆసక్తికర విషయాలు తెలిపారు. “నాకు సవాళ్లను ఎదుర్కోవడమంటే ఇష్టం. ఎందుకంటే రిస్క్ తీసుకోకుండా జీవితంలో అభివృద్ధిని ఆశించలేం.
నేను ఎన్నోసార్లు రిస్క్ తీసుకున్నా. నా ఈ పదిహేనేళ్ల కెరీర్‌లో కథల గురించి తెలుసుకున్నా. ఆ అనుభవంతోనే ఇప్పుడు ప్రొడ్యూసర్‌గా మారా. నాకు మంచి టీమ్ దొరికింది. ఈ చిత్రం కోసం పనిచేసే క్రమంలో నటిగా కంటే చిత్రీకరణ సమయంలో నిర్మాతగా ఎన్నో విషయాలను సమగ్రంగా తెలుసుకోగలిగా. తెలుసుకోవాల్సిన అంశాలు ఇంకా ఎన్నో ఉన్నాయన్నది నా భావన.
నేను ఒకే రకమైన సినిమాలకు పరిమితం కావాలని అనుకోవడంలేదు. ఎన్నో కథలు వినడానికి సితద్ధంగా ఉన్నా. ఒక మహిళగా నాకు నచ్చే సినిమాలే నిర్మించేందుకే ప్రాధాన్యమిస్తా. రొటీన్‌కు భిన్నమైన కథలను రూపొందిస్తా” అని చెప్పారు.