calender_icon.png 1 May, 2025 | 6:11 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సినిమా వాళ్లందరం అదే కోరుకోవాలి

01-05-2025 01:14:00 AM

నాని కథానాయకుడిగా నటిస్తున్న క్రైమ్ యాక్షన్ థ్రిల్లర్ ‘హిట్: ది థర్డ్ కేస్’. శ్రీనిధిశెట్టి హీరోయిన్‌గా నటించింది. డాక్టర్ శైలేశ్ కొలను దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని వాల్‌పోస్టర్ సినిమా, నాని యూనానిమస్ ప్రొడక్షన్స్ బ్యానర్లపై ప్రశాంతి తిపిర్నేని నిర్మించారు. ఈ సినిమా మే 1న పాన్ ఇండియాగా విడుదల కానుంది.

ఈ సందర్భంగా హీరో నాని చెప్పిన ఆసక్తికర విశేషాలివీ.. “ప్రతి సినిమానూ ఒక కొత్త జోనర్ లో చేయాలని ప్రయత్నం చేస్తాను. దీన్ని ట్రాన్స్‌ఫర్మేషన్‌గా చూడటంలేదు. నేనూ ప్రేక్షకుల్లో ఒకడినే అనే నమ్మకంతోనే నా పని నేను నిజాయితీగా చేసుకుంటూ వెళుతున్నా.  ‘హిట్3’లో యాక్షన్ వైలెన్స్ కథ డిమాండ్ మేరకు వచ్చిందే. ఈ సినిమా వైలెన్స్ కోసం తీయలేదు. తెరపై వైలెన్స్ చూస్తున్నప్పుడు అది డిస్ట్రబ్ చేసేలా ఉండదు. కచ్చితంగా టార్గెట్ ఆడియన్స్‌ను మెప్పించేలా ఉంటుంది. ఇందులో ఒక ప్రామిస్ రిలేటెడ్ ఎమోషన్ ఉంది.

-శైలేశ్ ఇలాంటి ఇంటెన్స్ యాక్షన్ సినిమాలు తీస్తున్నాడు కానీ, కామెడీ రాస్తే చాలా బ్రహ్మాండంగా ఉంటుంది. శ్రీనిధిశెట్టి ఈ సినిమాకు చాలా ప్లస్ అయింది. డీవోపీ షాన్ వర్గీస్ ప్రతి ఫ్రేమ్ వెనక మంచి ఉద్దేశం ఉంటుంది. మిక్కీ జే మేయర్ ఇప్పటివరకు ఫీల్‌గుడ్ సినిమాలే చేశారు. ఒకవేళ థ్రిల్లర్ చేస్తే సౌండ్ చాలా కొత్తగా ఉంటుంది. ఆ ఉద్దేశంతో ఆయన్ను తీసుకున్నాం. ఈ మధ్య ఆడియన్స్ థియేటర్స్‌కు రావడంలేదని వింటున్నాం. కానీ, ఆకట్టుకునే కంటెంట్ ఇస్తే కచ్చితంగా థియేటర్‌కు వస్తారు.

-అన్ని సినిమాలు బాగా ఆడితేనే మన సినిమా ఇంకా బాగా ఆడుతుంది. సినిమా రంగంలో ఉన్న అందరం ఇదే కోరుకోవాలి. అప్పుడే ఇండస్ట్రీ అద్భుతంగా ఉంటుంది. రాజమౌళి ‘హిట్’ ఫ్రాంచైజ్ సినిమాలకు చీఫ్‌గెస్ట్‌గా వచ్చారు. తర్వాతి సినిమాకు ఆయన గెస్ట్‌గా రాకపోతే ఎలా అనే టెన్షన్ మొదలైంది (నవ్వుతూ). ‘పారడైజ్’ ఒక ఎపిక్ స్కేల్‌లో ఉంటుంది. ‘హిట్3’ ఒక ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్. రెండూ దేనికవే ప్రత్యేకమైనవి. సాధారణంగా నిర్మాతలే యాక్టర్స్, డైరెక్టర్స్ దగ్గరకు వెళతారు. కానీ, చిరంజీవి సినిమాను ఆయన అభిమానిగా నేను ప్రొడ్యూస్ చేస్తేనే బాగుంటుందని టీమ్ అనుకోవడం గర్వంగా ఉంది” అన్నారు.