calender_icon.png 19 December, 2025 | 5:38 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మా కాలనీలను చర్లపల్లిలో కలపండి

18-12-2025 12:00:00 AM

డిప్యూటి కమిషనర్‌కు వినతిపత్రం అందజేత

 కుషాయిగూడ.డిసెంబర్ 17 (విజయ్ క్రాంతి):  చర్లపల్లి : జీహెచ్‌ఎంసి వార్డుల విభజనలో భాగంగా చర్లపల్లి డివిజన్ పరిదిలోని బి.ఎన్.రెడ్డి నగర్  భరత్ నగర్ కాలనీ లను ఇతర డివిజన్ల లో కాలిపారని తిరిగి చర్లపల్లి డివిజన్లో కాలపాలని బిఅర్‌ఎస్ నాయకులు జౌండ్ల ప్రభాకర్ రెడ్డి , డప్పు గిరిబాబులు కోరారు. చర్లపల్లి డివిజన్ కు చెందిన అన్ని పార్టీల నాయకుల అధ్వర్యంలో బుదవారం కాప్రా సర్కిల్ కార్యలయంలో డిప్యూటి కమిషనర్ జగనన్ ను కలసి వినతిపత్రం అందజేశారు.

ఈసందర్భంగా వారు మాట్లాడుతూ వార్డుల విభజనలో చర్లపల్లి డివిజన్ కు తీవ్ర అన్యాయం జరిగిందని ఈప్రాంతానికే గుర్తింపుగా ఉన్న చర్లపల్లి రైల్వే స్టేషన్, భరత్ నగర్ కాలనీలను శక్తిసాయినగర్ డివిజన్లో, చర్లపల్లి జైలుతో పాటు బిఎన్ రెడ్డి నగర్ కాలనీ  ని ఎక్కడో దూరంగా ఉన్న చక్రిపురం డివిజన్ లో కాలిపారని అన్నారు.

అలాగే ఈసినగర్ కాలనీని విడదీసి రెండు డివిజన్లలో చేర్చడమేమిటని ఈసినగర్ కాలని ని చర్లపల్లి డివిజన్లో ఈసినగర్ కాలనీ గణేష్ దేవాలయంను చక్రిపురం వార్డులో చేర్చడమేమిటని ప్రశ్నించారు. ఈకార్యక్రమంలో కాలనీవాసులు, వివిద పార్టీల నాయకులు మెట్టు మన్మోహన్ రెడ్డి, కోల నరేష్ గౌడ్, కొక్కొండ బాలరాజు, కడియాల అనిల్ కుమార్, రెడ్డినాయక్, రాజిరెడ్డి, రమాపతి, ఏజాజ్ తదితరులు పాల్గొన్నారు.