calender_icon.png 16 September, 2025 | 11:01 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఆధ్యాత్మికతతో పాటు సామాజిక బాధ్యత కూడా అవసరం

16-09-2025 09:07:45 PM

మోస్ట్ రెవరెండ్ విజయమోహన్ రావు 

చర్చి పాస్టర్లతో వన్డే సెమినార్

చర్ల,(విజయక్రాంతి): ఏసీఈ డయాలసిస్ హైదరాబాద్ వారిచే భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలంలో బస్టాండ్ సమీపంలోని బైబిల్ మిషన్ చర్చి వారి ఆధ్వర్యంలో ఒక్కరోజు సెమినార్ కార్యక్రమం మంగళవారం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా  ఫాస్టర్ ది మోస్ట్ రెవరెండ్ డాక్టర్ విజయమోహన్ రావు , ఏ సి ఈ డయాలసిస్ బిషప్ జవ్వాజి దిలీప్ కుమార్, ఏసీఈ బిషప్  డాక్టర్ దట్టి ప్రకాష్ రావులు హాజరయ్యారు. ఈ  అపూర్వ సమ్మేళనంలో ఒక్కరోజు సెమినార్ కార్యక్రమంలో పాస్టర్ రెవరెండ్ విజయ మోహన్ రావు మాట్లాడుతూ... ఆధ్యాత్మికం గానే కాకుండా సామాజికంగా కూడా బాధ్యత కలిగి ఉండాలని ప్రతి ఒక్కరూ సామాజిక వ్యవస్థ బాగుండేలా ఆలోచన చేయాలని, కావాల్సింది పథకాల కంటే ముఖ్యం విద్య వైద్యం, అభివృద్ధి అని, అభివృద్ధి కోసం ప్రభుత్వాలు పనిచేయాలని సమాజం బాగుంటేనే ప్రజలు బాగుంటారని ఈ సందర్భంగా రెవరెండ్ విజయ్ మోహన్ రావు మాట్లాడారు.