calender_icon.png 16 September, 2025 | 11:02 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కొనసాగుతున్న యూరియా ఇక్కట్లు

16-09-2025 08:58:56 PM

తెల్లవారుజాము నుంచే క్యూ కడుతున్న రైతులు

యూరియా కోసం పస్తులు ఉంటూ పడి కాపులు కాస్తున్న రైతులు

రైతుల ఇబ్బందులపై కనికరించని అధికారులు

కామారెడ్డి జిల్లాలో యూరియా కోసం రైతుల అగచాట్లు

కామారెడ్డి,(విజయక్రాంతి): కామారెడ్డి జిల్లాలో యూరియా కోసం రైతుల ఆగ చాట్లు తప్పడం లేదు. యూరియా కావాలంటే తెల్లవారుజామునే విండో కార్యాలయం వద్దకు వెళ్లి క్యూ కట్టాల్సిందే. నిత్యం కామారెడ్డి జిల్లాలో యూరియా ఎరువు బస్తా కోసం రైతుల కు అగచాట్లు తప్పడం లేదు. మంగళవారం కామారెడ్డి జిల్లా కేంద్రంలోని విండో కార్యాలయం ఎదుట అధికారులు రాకముందే తెల్లవారుజామున విండో కార్యాలయం వద్దకు వచ్చి అధికారుల కోసం నిరీక్షించారు. గత మూడు రోజుల క్రితం యూరియా బస్తాల కోసం టోకెన్లు ఇచ్చిన అధికారులు మంగళవారం యూరియా భాస్కర్ టోకెన్ల వారిగా పంపిణీ చేస్తామని చెప్పడంతో తెల్లవారుజామునే కామారెడ్డి విండో కార్యాలయం వద్దకు చేరుకున్నా రైతులు రెండు గంటల పాటు అధికారుల కోసం వేచి చూశారు. కూపాన్లు పంపిణీ చేసిన వారికి యూరియా బస్తాను. అందించారు. భిక్కనూరు మండలం జంగంపల్లిలో యూరియా కోసం రైతులు పస్తులు ఉంటూ పడిగాపులు కాసారు. రాజంపేట మండలం తలమడ్ల గ్రామంలో యూరియా కోసం రైతులు వ్యవసాయ పనులకు వెళ్లకుండా యూరియా కోసం పడిగాపులు కాశారు. సహకార సంఘాల ముందు రోజుల తరబడి బస్సులు ఉంటూ యూరియా కోసం పరిణాపులు కాస్తున్నామని రైతు లు ఆరోపించారు. అధికారులు మాత్రం స్పందించడం లేదని రైతుల ఆరోపించారు. అధికారుల తీరుపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి యూరియా సరఫరా చేయాలని రైతులు కోరుతున్నారు. యూరియా సరపర చేయడంపై రైతులు  ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గ్రామాలకు ట్రాక్టర్ల,  లారీల ద్వారా లోడు యూరియా బస్తాలను పంపిస్తున్న రైతులకు సరిపోవడంలేదని రైతులు అంటున్నారు. ఇప్పటికైనా రైతులకు సరిపడా యూరియాను తెచ్చి పంపిణీ చేయాలని అధికారులను కోరుతున్నారు. తెల్లవారుజామునే వెళ్లి క్యూ కడుతున్నారు. లేకుంటే యూరియా బస్తా దొర కదు అని ఆందోళన చెందుతున్నారు. ఇంకా ఎన్ని రోజులు యూరియా కోసం తంటాలు పడాలో అర్థం కావడంలేదని రైతులు  ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.