calender_icon.png 16 September, 2025 | 10:58 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సుప్రీంకోర్టులో వేసిన పిటిషన్ ఉపసంహరించుకోవాలి

16-09-2025 09:04:55 PM

గిరిజన సంఘాలు ఏకతాటిపైకి రావాలి

త్వరలో జరిగే ర్యాలీకు భారీగా తరలి రావాలి

గిరిజన సంఘాల నాయకులు పిలుపు 

కోదాడ: లంబాడీలను ఎస్టీ జాబితా నుండి తొలగించాలని మాజీ ఎంపీ సోయం బాపూరావు, భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకటరావు సుప్రీంకోర్టులో వేసిన పిటిషన్ ను తక్షణమే ఉపసంహరించుకోవాలని కోదాడ నియోజకవర్గం గిరిజన సంఘం నాయకులు డిమాండ్ చేశారు. మంగళవారం లంబాడ హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో కోదాడ పట్టణంలోని పబ్లిక్ క్లబ్ ఆడిటోరియంలో రౌండ్ టేబుల్ సమావేశమును నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ... త్వరలో జరిగే గిరిజన ర్యాలీకు విద్యార్థులు, గిరిజన నాయకులు భారీగా తరలిరావాలని పిలుపునిచ్చారు. లంబాడీలు అభివృద్ధి చెందారని, మాజీ ఎంపీ  ఈర్ష పడటం సరైనది కాదన్నారు.

నేటికీ లంబాడీలల్లో ఉద్యోగం లేక, విద్యా లేక అభివృద్ధికి ఆమడంత దూరంలో ఉన్నారు. రానున్న రోజుల్లో లంబాడీలపై బీజేపీ నాయకులు దుష్ప్రచారం చేయొద్దని వారికి హితవు పలికారు. 10 శాతం రిజర్వేషన్ అన్ని గిరిజన సంఘాలకు సమానంగా వర్తింపచేయాలని వక్తలు ప్రసంగించారు. రిజర్వేషన్ కల్పించింది మాజీ ఎంపీ స్వయం బాపూరావు, ఎమ్మెల్యే వెంకట్రావు లు కాదని,. డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ రాజ్యాంగంలో ఎస్టీలకు రిజర్వేషన్ కల్పించారని, తొలగించమని చెప్పడానికి మీరు ఎవరని వారు ప్రశ్నించారు.