calender_icon.png 17 September, 2025 | 8:41 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పారిశుద్ధ్య పనులను సక్రమంగా నిర్వహించాలి

16-09-2025 08:20:28 PM

రేణుక అక్షర మహిళా మండలి అధ్యక్షురాలు  సరోజ

మణుగూరు,(విజయక్రాంతి): స్పెషల్ ఆఫీసర్ల పరిపాలనలో గ్రామ పంచాయతీలు చెత్త కుప్పలుగా మారాయని, రేణుక అక్షర మహిళా మండలి సభ్యులు ఆరోపించారు. మంగళవారం వారు రాజీవ్ గాంధీనగర్ లో పర్యటించి ఖాళీ స్థలాలను డ్రైనేజీ నీరు నిలిచిన ప్రదేశాలను పరిశీలించారు. సంఘం అధ్యక్షురాలు  పూనెం సరోజ మాట్లాడుతూ.. అధికారుల పర్యవేక్షణ లోపంతో పారిశుద్ధ్య నిర్వహణ అస్తవ్యస్తంగా మారిందని, రోజుల తరబడి  ట్రాక్టర్ల ద్వారా చెత్త తరలించక పోవడంతో వీధులన్నీ దుర్గంధం వెదజల్లుతున్నాయని మండి పడ్డారు.కనీసం డ్రైనేజీలు శుభ్రపరచడం గాని బ్లీచింగ్ చల్లడం గానీ దోమల నియంత్రణ కొరకు పాగింగ్ చేయడం గాని  చేపట్టడం లేదన్నారు.

కొందరు వ్యాపారులు డ్రైనేజీలను ఆక్రమించి నిర్మాణాలు చేపట్టడంతో మురుగు నీటి కాల్వల్లో చెత్త పేరుకుపోయి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆ వేదన వ్యక్తం చేశారు. అధికారులు తక్షణమే పరిశుద్య పనులను  చేపట్టాలన్నారు. మరోవైపు ప్రభుత్వ భూములలో పెద్ద ఎత్తు న అక్రమ నిర్మాణాలు సాగుతు న్నాయని, అధికారులు బదిలీ అయితే ప్రైవేటు భూములుగా మారుతున్నా యని దీనిపై తాహసిల్దార్ దృష్టి సారించి ఆ నిర్మాణాలను కట్టడి చేసి భూములు స్వాధీనం చేసుకుని ప్రభుత్వ అవసరాలకు వినియోగించాలని కోరారు.