16-09-2025 08:17:43 PM
కామారెడ్డి,(విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా రోటరీ క్లబ్ కామారెడ్డి వారి ఆధ్వర్యంలో మంగళవారం పీపమంగళవారంఇండియా వారి సహకారంతో దివ్యాంగులైన పిల్లలకు వీల్ చైర్స్, బెడ్స్ పంపిణి చేశారు. స్థానిక రోటరీ క్లబ్ ఆఫ్ కామారెడ్డి వారు పీపుల్స్ ఫర్ ఇండియా వారి సహకారంతో మంగళవారం గర్గుల్ ప్రాంతంలోని దివ్యాంగులైన పిల్లలకు వీల్ చైర్స్, బెడ్స్ నిపంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిధిగా విచ్చేసినటువంటి దేవుని పల్లీ ఎస్సై రంజిత్, రోటరీ అసిస్టెంట్ గవర్నర్ డాక్టర్ ఎం జైపాల్ రెడ్డి, సదాశివనగర్ విద్యాశాఖ అధికారి యోసెఫ్ మాట్లాడుతూ...మంగళవారం స్థానిక రోటరీ క్లబ్ ఆఫ్ కామారెడ్డి వారి ఆధ్వర్యంలో పీపుల్ ఫర్ ఇండియా వారి సహకారంతో గర్గుల్ లో దివ్యాంగులైన పిల్లలకు నేడు వీల్ చైర్స్, బెడ్స్ పంపిణీ చేయడం వలన వారి కనీస సౌకర్యాలకు ఇవి ఎంతగానో తోడ్పడుతాయని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి ఎస్సై రంజిత్ , విద్యాశాఖ అధికారి యోసెఫ్ ఇలాంటి కార్యక్రమాలు రోటరీ క్లబ్ ఆఫ్ కామారెడ్డి వారు ఎల్లప్పుడు నిర్వహిస్తారని దీని ద్వారా చాలామంది ప్రజలకు మేలు కలుగుతుందని వారు హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఎస్సై రంజిత్ రోటరీ అసిస్టెంట్ గవర్నర్ డాక్టర్ ఎం జైపాల్ రెడ్డి ఎంఈఓ యూసఫ్, రోటరీ ప్రెసిడెంట్ శంకర్, సెక్రటరీ కృష్ణహరి, రమేష్, రోటరీ సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.