calender_icon.png 16 September, 2025 | 11:05 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

భద్రాద్రి మార్బుల్స్ వర్కర్స్ యూనియన్ నూతన కమిటీ ఎన్నిక...

16-09-2025 09:02:03 PM

భద్రాచలం (విజయక్రాంతి): సిఐటియు అనుబంధ భద్రాద్రి మార్బుల్ వర్కర్స్ యూనియన్ స్థానిక చందర్రావు భవనంలో జరిగిన ఆరవ మహాసభలో నూతన కమిటీ 15 మందితో ఏకగ్రీవంగా ఎన్నికయింది. కమిటీ నూతన అధ్యక్షులుగా ఎల్.సురేష్ కార్యదర్శిగా పి.ప్రసాద్ కోశాధికారిగా చంటి ఎన్నిక కాగా మార్బుల్ వర్కర్స్ యూనియన్ గౌర అధ్యక్షులుగా పాల్వాయి మధు గౌరవ సలహాదారుడుగా ఎస్డి భాష లంక శ్రీను లను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు సహాయ కార్యదర్శులుగా సిహెచ్ చిన్న రాజు ఉపాధ్యక్షులుగా షేక్ ఖాజా పి వెంకటేష్ లతోపాటు కమిటీ సభ్యులుగా ఎస్కే హుస్సేన్ రాజేష్ రాముడు చిన్న హుస్సేన్ తోపాటు 15 మందిని నూతన కమిటీ సభ్యులుగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.

ఈ సందర్భంగా నూతన అధ్యక్ష కార్యదర్శులు సురేష్ ప్రసాద్ లు మాట్లాడుతూ మార్బుల్ రంగంలో కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలపై మహాసభ పలు తీర్మానాలను చేసిందని అన్నారు. మహాసభ సందర్భంగా వచ్చిన సమస్యలపై ఈనెల 23 24 తేదీల్లో జరగనున్న భవన నిర్మాణ కార్మిక రాష్ట్ర మహాసభలో చర్చించి కార్యక్రమాలను రూపొందిస్తామని అన్నారు. మార్బుల్ కార్మికులకు రావాల్సిన అన్ని రకాల సౌకర్యాలపై యూనియన్ ఆధ్వర్యంలో రానున్న కాలంలో పోరాటాలు రూపొందిస్తామని స్పష్టం చేశారు.