21-05-2025 12:00:00 AM
కొత్తపల్లి, మే 20: హనుమాన్ జయంతి రోజున కేంద్ర మంత్రివర్యులు, కరీంనగర్ పార్లమెం టు సభ్యులు బండి సంజయ్ కుమార్ ఆధ్వర్యంలో చేపడుతున్న ‘ హిందూ ఏక్తాయాత్ర ఏర్పాట్ల ను మంగళవారం రోజున కరీంనగర్లోని వైశ్య భవన్ వద్ద బిజెపి శ్రేణులతో కలిసి జిల్లా అధ్యక్షు డు గంగాడి కృష్ణారెడ్డి పర్యవేక్షించారు.
ఈ సందర్భంగా గంగా డి కృష్ణారెడ్డి నాయకులు కార్యకర్తలకు ఏక్తాయాత్ర పై పలు సూచనలు చేసి దిశా నిర్దేశం చేశారు. ఈ సందర్భంగా ఆయన మా ట్లాడుతూ ఈనెల 22న జరగబోయే హిందూ ఏక్తాయాత్రను కేంద్రమంత్రి బండి సంజయ్ కు మార్ అత్యంత వైభవంగా నిర్వహించడానికి తగిన చర్యలు తీసుకున్నారని తెలిపారు.
కరీంనగ ర్ పట్టణంలోని వైశ్య భవన్ నుండి సాయంత్రం నాలుగు గంటలకు యాత్ర ప్రారంభమై, ప ట్టణంలోని పలు ప్రాంతాల మీదుగా యాత్ర కొనసాగుతుందని తెలిపారు.రాజకీయాలకతీతం గా ప్రజలు, హిందూ ధర్మం గురించి ఆలోచించే సమాజం, యువత స్వచ్ఛందంగా యాత్రకు హాజరై విజయవంతం చేయాలని ఆయన ఈ సందర్భంగా పిలుపునిచ్చారు.
ఇట్టి కార్యక్రమంలో మాజీ మేయర్ సునీల్ రావు, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కోమల ఆంజనేయులు, మాజీ డిప్యూటీ మేయర్ గుగ్గిలపు రమేష్ , సీనియర్ నాయకులు కన్నబోయిన ఓదెలు , జిల్లా ప్రధాన కార్యదర్శి మాడ వెంకటరెడ్డి , పార్లమెంట్ కన్వీనర్ బోయిన్పల్లి ప్రవీణ్ రావు , ఉపాధ్యక్షులు కన్న కృష్ణ , బండ రమణారెడ్డి, దండు కొమరయ్య, మాజీ కార్పొరేటర్లు పెద్దపల్లి జితేందర్, వంగల పవన్, సతీష్ , దుర్శెట్టి అనూప్ , మహిళా మోర్చా అధ్యక్షురాలు చొప్పరి జయ శ్రీ , అసెంబ్లీ కన్వీనర్ దూబల శ్రీనివాస్, లడ్డు ముందాడా, చిట్టి కరుణాకర్ , అడిచెర్ల రాజు, తనకు సాయి , అవదుర్తి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.