15 April, 2026 | 1:12 PM

Breaking News

మహిళలంటే రేవంత్ రెడ్డికి ఎందుకు వివక్ష?.. సీఎంకు ఎంపీ లక్ష్మణ్ కౌంటర్   •   ఎంపీ అశోక్ మిట్టల్‌ వ్యాపార సంస్థలపై ఈడీ దాడులు   •   బీహార్ రాజకీయాల్లో చారిత్రక ఘట్టం... సీఎంగా సామ్రాట్‌ చౌదరి   •   రేవంత్‌ రెడ్డితో పీసీసీ చీఫ్, మీనాక్షి నటరాజన్ భేటీ   •   తెలంగాణ పర్యాటక రంగాన్ని బలోపేతం చేస్తాం: మంత్రి జూపల్లి   •   ఛత్తీస్‌గఢ్‌లో భారీ పేలుడు: 14కు చేరిన మృతుల సంఖ్య.. న్యాయవిచారణకు కాంగ్రెస్ డిమాండ్   •   AP Inter Results 2026: ఏపీ ఇంటర్ ఫలితాలు విడుదల   •   పంజాబ్‌లో బస్సు బోల్తా: ఆరుగురు యాత్రికులు మృతి   •   దక్షిణాదిలో ప్రజాఉద్యమం తప్పదు.. కేంద్ర ప్రభుత్వానికి KTR హెచ్చరిక   •   సంక్షేమ- అభివృద్ధి సమన్వయమే ప్రభుత్వ ధ్యేయం: మంత్రి పొంగులేటి   •  

ఆర్టీఐపై పారదర్శకత ఉండాలి

23-06-2025 12:00 AM

సమాచార హక్కు చట్టం సాధన కమిటీ వ్యవస్థాపక జాతీయ అధ్యక్షుడు చంటి ముదిరాజ్

ముషీరాబాద్, జూన్ 22 (విజయక్రాంతి): సమాచార హక్కు చట్టం అమలుపై ప్రభుత్వానికి పారదర్శకత, అధికారులు జవాబుదారిగా ఉండాలని సమాచార హక్కు చట్టం సాధన కమిటీ వ్యవస్థాపక జాతీయ అధ్యక్షులు డాక్టర్ చంటి ముదిరాజ్ అన్నారు. ఈ మేరకు ఆదివారం హైదరాబాద్‌లోని బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్ లో సమా చార హక్కు చట్టం సాధన కమిటీ ఆధ్వర్యంలో రాష్ట్ర కార్యవర్గ సమావేశం జరిగింది.

ఈ  కార్యక్రమానికి 33 జిల్లాల నుంచి ఆర్టిఐ సాధన కమిటీ సభ్యులు హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో సమాచార హక్కు చట్టం సాధన కమిటీ వ్యవస్థాపక జాతీయ అధ్యక్షులు డాక్టర్ చంటి ముదిరాజ్  ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతూ సమాచార హక్కు చట్టం పూర్తి స్థాయిలో అమలు కావడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వ కార్యాలయాల్లో అధికారుల నుంచి సహకారం లభించడం లేదన్నారు.

అధికారుల్లో జవాబుదారితనం కొరవడిందన్నారు. సమాచారం కోసం దరఖాస్తు చేసుకున్న 30 రోజుల్లో ఆ వ్యక్తికి కోరిన సమాచారం అం దించాల్సిన బాధ్యత ఆయా అధికారులపై ఉందన్నారు. నిర్ణీత సమయంలోపు అందించకపోతే అప్పిలేట్ అధికారికి అప్పీల్ చేసు కోవచ్చన్నారు. ఇక్కడా స్పందన రాకపోతే రాష్ట్ర సమాచార చట్టం చీఫ్ కమిషనర్ కు అప్పీల్ చేసుకోవాలన్నారు. కమిషన్ స్పం దించి సంబంధిత అధికారులపై చర్యలు తీసుకుంటుందన్నారు.

సమాచార హక్కు చట్టాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలన్నారు. రాజ్యాంగం కల్పించిన ఈ హక్కును నిరాకరించే అధికారం ప్రభుత్వ వ్యవస్థలో ఏ శాఖ, అధికారికి లేదన్నారు.

సమాచార హక్కు చట్టం సాధన కమిటీ రాష్ట్ర అధ్యక్షురాలు సూర స్రవంతి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మల్లం వెంకటేశం అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షులు చింతల రాఘవేంధర్ ముదిరాజ్, రాష్ట్ర కన్వీనర్ కిఫ్ఫాయాత్ అలీ, రాష్ట్ర అధికార ప్రతినిధి ఎన్ దిలీప్ రావ్, రాష్ట్ర ఉపా ధ్యక్షులు గోపీనాథ్ కట్టెకోల, రాష్ట్ర కార్యదర్శి చింతల క్రిష్ణ, రాష్ట్ర సంయుక్త కార్యదర్శులు వై కార్తీక్ రెడ్డి, బి లక్ష్మణ్, ఆర్ లక్ష్మణ్, వి గణేష్, వి శ్రవణ్ కుమార్, రామకృష్ణ, అశోక్,33 జిల్లాల సమాచార హక్కు చట్టం సాధన కమిటీ సభ్యులు పాల్గొన్నారు.