calender_icon.png 11 July, 2025 | 7:27 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రపంచ శాంతికి ప్రత్యేక ప్రార్థనలు

23-06-2025 12:00:00 AM

 కోదాడ నియోజకవర్గ క్రిస్టియన్ మైనారిటీ అధ్యక్షులు యేసయ్య 

 కోదాడ జూన్ 22:  స్థానిక నాయనగర్ బాప్టిస్ట్ చర్చిలో ఆదివారం పాస్టర్ యేసయ్య ఆధ్వర్యంలో ప్రపంచ శాంతి కోసం ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు  గత కొన్ని సంవత్సరాల నుండి రష్యా, ఉక్రెయిన్, రెండు సంవత్సరాల నుండి ఇజ్రాయిల్, ఇరాన్ ఇతర ప్రాంతలో జరుగుతున్న యుద్ధాలు ఆపబడాలని పశ్చిమాసియాలో శాంతి నెలకొల్ప బడాలని ప్రార్థనలు నిర్వహించినట్లు పాస్టర్ తెలిపారు.

ఇట్టి యుద్ధాల వల్ల అనేకమంది అమాయక ప్రజలు చనిపోతున్నారన్నారు. ఈ కార్యక్రమంలో నడిగూడెం మండలం మాజీ ఎంపీపీ యాతాకుల జ్యోతి,  జగ్గు నాయక్ , హెడ్ కానిస్టేబుల్ జాన్  మోజస్, జ్యోతి,  స్రవంతి, పోయిలా సాల్మన్,  రాంబాబు, తమలపాకల సైదులు తదితరులు పాల్గొన్నారు.