19 August, 2026 | 1:25 AM

అభివృద్ధిలో నిర్లక్ష్యం చేస్తే ఉపేక్షించేది లేదు

19-08-2026 12:30 AM
  1. పనులు స్టార్ట్ చేయని కాంట్రాక్టర్లను బ్లాక్‌లిస్ట్‌లో పెట్టండి
  2. ఎమ్మెల్యే మహిపాల్‌రెడ్డి ఆదేశం

పటాన్ చెరు, ఆగస్టు 18 : అభివృద్ధి పనుల్లో జాప్యానికి తావు లేదని నిర్లక్ష్యాన్ని ఎంతమాత్రం సహించబోమని ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని నిర్ణీత సమయంలో పూర్తి చే యవలసిన గురుతర బాధ్యత తమపై ఉంద ని ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి తెలిపా రు. అభివృద్ధి పనుల విషయంలో అధికారు లు, కాంట్రాక్టర్లు పూర్తి బాధ్యతతో పనిచేయాలని, ప్రజలకు మెరుగైన మౌలిక వసతులు అందించడమే లక్ష్యంగా ముందుకు సాగాల ని స్పష్టం చేశారు.

మంగళవారం పటాన్ చె రు డివిజన్ పరిధిలోని క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే అధ్యక్షతన నియోజకవర్గ స్థాయి సమావేశం నిర్వహించారు. సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్, మున్సిపాలి టీలు, విద్యుత్, విద్య, నీటిపారుదల, పంచాయతీరాజ్, ఆర్‌అండ్బీ, జాతీయ రహదారు ల సంస్థ తదితర శాఖల అధికారులతో విస్తృతంగా సమీక్షించారు.

ఇంద్రేశం, ఇస్నాపూర్, జిన్నారం, గుమ్మడిదల, గడ్డపోతారం మున్సిపాలిటీల పరిధిలో సుమారు రూ.75 కోట్ల తో కొనసాగుతున్న అభివృద్ధి పనుల పురోగతిని ఎమ్మెల్యే సమీక్షించారు. ప్రతి పనికి నిర్దేశిత గడువు నిర్ణయించుకొని, ఆ గడువులోగా పనులు పూర్తిచేసి ప్రజలకు అందుబా టులోకి తీసుకురావాలని ఆదేశించారు.

పనిచేయని కాంట్రాక్టర్లపై కొరఢా..

టెండర్ పూర్తయినప్పటికీ కాలయాపన చేస్తున్న కాంట్రాక్టర్లపై ఎమ్మెల్యే తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజల కోసం మంజూరైన నిధులు కార్యాలయాల ఫైళ్లలో ఉండటానికి కాదు ప్రజలకు ఉపయోగపడే పనులుగా మారాలి అని అన్నారు. పనులు ప్రారంభించని కాంట్రాక్టర్లపై నిబంధనల ప్రకారం చర్యలు తీసుకోవడంతో పాటు వారిని బ్లాక్లిస్ట్లో చేర్చాలని అధికారులను ఆదేశించారు. అవసరమైతే వారి స్థానంలో కొత్త కాంట్రాక్టర్లను ఎంపిక చేసి పనులను వెంటనే ప్రారంభించాలని సూచించారు.