calender_icon.png 17 July, 2025 | 6:17 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పదవి ఇవ్వాలని ముక్తకంఠంతో కోరిండ్రు

18-06-2025 01:06:05 AM

- సామాన్య కార్యకర్తకు మంత్రి పదవి ఇచ్చింది కాంగ్రెస్ 

- అరులైన ప్రతి లబ్ధిదారుడికి సంక్షేమ పథకాలు అందిస్తాం 

- విలేకరుల సమావేశంలో రాష్ర్ట పశుసంవర్ధక శాఖ మంత్రి వాకిటి శ్రీహరి 

మహబూబ్ నగర్ జూన్ 17 (విజయ క్రాంతి) :  సామాన్య కార్యకర్తకు మంత్రి పదవి ఇచ్చిన ఘనత కేవలం కాంగ్రెస్ పార్టీకి మాత్రమే దక్కుతుందని రాష్ర్ట పశుసంవర్ధక శాఖ మంత్రి వాకిటి శ్రీహరి స్పష్టం చేశారు.రాష్ర్ట మంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన తరువాత తొలిసారిగా మంగళవారం మహబూబ్ నగర్ కు విచ్చేసిన మంత్రి ఆర్ అండ్ బి అతిథి గృహంలో దగ్గర ఉన్న అమరవీరుల స్థూపం వద్ద పుష్పగుచ్చం ఉంచి నివాళులు అర్పించారు.  అనంతరం ఊరేగింపుగా కాంగ్రెస్ పార్టీ కార్యాలయం వరకు మంత్రి తో ఎమ్మెల్యేలతో  కలిసి వచ్చారు. 

 అనంతరం పార్టీ శ్రేణులు మంత్రికి శుభాకాంక్షలు తెలియజేశారు.  ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో రాష్ర్ట పశుసంవర్ధక  మరియు క్రీడలు శాఖ మంత్రి వాకిటి శ్రీహరి మాట్లాడారు.   మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత తొలిసారిగా మహబూబ్ నగర్ కు రావడం సంతోషంగా ఉందని చెప్పారు.  ప్రతి లబ్ధిదారుడికి ప్రభుత్వం అందించే సంక్షేమ పథకాలు అందించేందుకు కృషి చేస్తాననిహామీ ఇచ్చారు.  భగవంతుడిచ్చిన ఆశీర్వా దం తో, రాష్ర్ట ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆశ్శీస్సులతో సామాన్య కార్యకర్తగా ఉన్న తనకు  మంత్రి పదవి దక్కిందని,  జిల్లా ఎమ్మెల్యేలు అందరూ నాకు మంత్రి పదవి ఇవ్వాలని ముక్త కంఠంతో కోరారని చెప్పా రు. 

మహబూబ్ నగర్ ఎమ్మెల్యే ెున్నం శ్రీనివాస్ రెడ్డి కృషితో, జడ్చర్ల ఎమ్మెల్యే సహకారం తో  మహబూబ్ నగర్ జిల్లా కు ఐఐఐటి కళాశాల రావడం తనకు సంతోషంగా ఉందన్నారు.  అంతకుముందు మహ బూబ్ నగర్ ఎమ్మెల్యే ెున్నం శ్రీనివాస్ రెడ్డి గారు మాట్లాడుతూ మహబూబ్ నగర్ జిల్లా లోని ప్రతి పౌరుడు కూడా స్పందించి మన మహబూబ్ నగర్ బిడ్డను ముఖ్యమంత్రి చేసుకోవాలి అని భావించి 14 సీట్లకు గాను 12 సీట్లను ఇచ్చి మన మహబూబ్ నగర్ బిడ్డను ముఖ్యమంత్రి స్థానంలో కూర్చోబెట్టారన్నారు. ముఖ్యమంత్రి అయిన తర్వాత అహర్నిశలు శ్రమించి ఏఏ ప్రాంతంలో ఏ సమస్యలు ఉన్నాయో గుర్తించి, శీఘ్రగతిన అభివృద్ధి చేయడం చేస్తున్నారని ఆయన చెప్పారు.

అన్ని వర్గాలకు సమన్యాయం చేయాలనే సంకల్పం మన ముఖ్యమంత్రికి ఉందన్నారు.  అందుకే ముదిరాజ్ బిడ్డ అయిన మన మహబూబ్ నగర్ బిడ్డను మంత్రిగా నియమించారని,  వాకిటి శ్రీహరి కి వచ్చిన శాఖ మాములు శాఖ కాదని, యాదవుల, ముదిరాజ్ బిడ్డల అభ్యున్నతికి కృషి చేసే శాఖ అన్నారు.  తెలంగాణ రాష్ర్ట అభివృద్ధి లో యువత పాత్ర చాలా కీలకం కానుంది అని అందుకే ఆ శాఖను కూడా మన వాకిటి శ్రీహరి కి ఇచ్చారని ఆయన స్పష్టం చేశారు.  మహబూబ్ నగర్ కార్పోరేషన్ లో కాని, జిల్లాలోని గ్రామాల్లో  ఉన్న సమస్యలను మంత్రి ద్వారా ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకుపోవచ్చ అని, కేంద్ర రాష్ర్ట ప్రభుత్వాల నుంచి అత్యధిక సంఖ్యలో నిధులు తెచ్చి ఉమ్మడి జిల్లా అభివృద్ధికి కృషి చేస్తారని ఆకాంక్షించారు. 

అనంతరం క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే ెున్నం శ్రీనివాస్ రెడ్డి సొంత నిధులతో మహిళలకు అందిస్తున్న ఉచిత శిక్షణను పూర్తి చేసుకున్న మహిళలకు సర్టిఫికెట్లను రాష్ర్ట మంత్రి వాకిటి శ్రీహరి అందజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ విజయేందిర బోయి, దేవరకద్ర ఎమ్మె ల్యే జి.మధుసూదన్ రెడ్డి, మైనారిటీ ఫైనాన్స్ కార్పోరేషన్ చైర్మన్ ఓబేదుల్లా కొత్వాల్, ముడా చైర్మన్ లక్ష్మణ్ యాదవ్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మల్లు నర్సింహ్మారెడ్డి, టి పిసిసి ప్రధాన కార్యదర్శి  సంజీవ్ ముదిరాజ్,  టి పిసిసి అధికార ప్రతినిధి జ హీర్ అక్తర్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ఎన్ పి వెంకటేష్, వినోద్ కుమార్, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ పెద్ద విజయ్ కుమార్, మాజీ మున్సిపల్ చైర్మన్ ఆనంద్ గౌడ్, డిసిసి ప్రధాన కార్యదర్శి సిరాజ్ ఖాద్రీ, సిజె బెనహార్, జిల్లా ఎస్సీ సెల్ చైర్మన్ సాయి బాబా, ఫయాజ్, అవేజ్, అజ్మత్ అలి పాల్గొన్నారు.