మిల్లర్లతో కుమ్మక్కై రైతులను ముంచుతున్నారు
- నిబంధనలకు విరుద్ధంగా తూకం వేస్తున్నారు
- 50 రోజులు గడిచిన సగం ధాన్యం కొనుగోలు చేయలే
- నల్గొండ మాజీ ఎమ్మెల్యే కంచర్ల
నల్లగొండ టౌన్, మే 7: మిల్లర్లతో కాంగ్రెస్ నాయకులు అధికారులు మంత్రులు ఎమ్మెల్యేలు కుమ్ముకై రైతులను నిండా మంచుతున్నారని నల్గొండ మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి ఆరోపించారు. నల్లగొండలోని ఆర్జాలబాయి, ఎస్ ఎల్ బి సి ల వద్ద ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను పలువు నాయకులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిబంధనకు విరుద్ధంగా తూకం వేస్తున్నారని ధాన్యం కొనుగోలు తర్వాత వెంటనే ట్రక్ సీట్ ఇవ్వడం లేదని ధాన్యం దిగుమతి చేసుకునే కాడ మిల్లర్లు కోర్రిలు పెడుతున్నారని రైతులను ఇబ్బంది పెడితే కలెక్టరేట్ కార్యాలయం ముట్టడిస్తామని హెచ్చరించారు.
కెసిఆర్ పాలనలో ధాన్యం ఎంత వస్తే అంత కొనుగోలు చేశారని, కానీ నేడు కాంగ్రెస్ నాయకులు, మంత్రులు, అధికారులు..మిల్లర్లతో కుమ్మక్కై రైతులకు తీవ్ర నష్టం చేస్తున్నారని ఆరోపించారు తమకిష్టమైన వారికే ముందుగా తూకం వేయడం తో అక్రమాలకు పాల్పడుతున్నారని..తక్షణమే జిల్లా అధికారులు బాధ్యులపై చర్యలు తీసుకోవాలని.రైతుల నుండి ధాన్యం వెంటనే ఎటువంటి కొర్రీలు లేకుండా సేకరించాలని కోరారు ధాన్యం కనుగొన్న వేగం పెంచాలని ఎక్కువ లారీలు సమకూర్చి రైతులకు ఇబ్బందులు లేకుండా చేయాలి అన్నారు.
పట్టణపార్టీ అధ్యక్షులు భువనగిరి దేవేందర్, నల్గొండ మండల పార్టీ అధ్యక్షులు దేప వెంకట్ రెడ్డి, నారబోయిన బిక్షం తుమ్మల లింగస్వామి, బొజ్జ వెంకన్న, కార్పొరేటర్లు మారగోని భవాని గణేష్,, పెరిక యాదయ్య పేర్ల అశోక్, దొడ్డి రమేష్ బాణావత్ దీప్లా, గోపగోని స్వాతి రాజశేఖర్, కుందూరు దీపిక ప్రవీణ్ రెడ్డి, మాజీ కౌన్సిలర్లు రావుల శ్రీనివాస్ రెడ్డి, గున్ రెడ్డి యుగంధర్ రెడ్డి, దండంపెల్లి సత్తయ్య, పనస శ్రీను, బొడ్డుపల్లి శ్రవణ్ కుమార్ తదితరులు వెంట ఉన్నారు






