మాటిచ్చారు.. నిలబెట్టుకున్నారు
ఎన్నికల్లో ఇచ్చిన హామీని నెరవేరుస్తున్న మున్సిపల్ చైర్పర్సన్ సమత వెంకట్ రెడ్డి
చేవెళ్ళ ఆగష్టు 26(విజయక్రాంతి): చేవెళ్ల మున్సిపాలిటీలోని 16వ వార్డు కౌసిలర్ బండారి శైలజ ఆగిరెడ్డి ఎన్నికల్లో ఇచ్చిన హామీ నిలబెట్టుకున్నారు. చాకలి అనంతయ్య కుమార్తె వివాహానికి రూ.25,000 ఆర్థిక సహాయం అందజేశారు. అనంతరం వారు మాట్లాడుతూ... ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చడమే తమ బాధ్యతన్నారు. పేద మధ్యతరగతి కుటుంబాలకు అండగా నిలుస్తూ.. అవసరమైన సమయంలో ఆపన్నహస్తం అందిస్తూ ప్రజలకు అందుబాటులో ఉంటామని ఆమె తెలిపారు.
అయితే ఆడపడుచు వివాహంకు ఆర్థిక సాయం చేయడంతో ఇచ్చిన మాట నిలబెట్టుకుంటున్నారని ప్రజలు చెబుతున్నారు. ఈ కార్యక్రమంలో చేవెళ్ల మాజీ సర్పంచ్ ప్రస్తుత కౌన్సిలర్ బండారి శైలజ ఆగిరెడ్డి, సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు సోలిపురం బల్వంత్ రెడ్డి,మాజీ ఉప సర్పంచులు టేకులపల్లి శ్రీనివాస్ యాదవ్, గంగి యాదయ్య, నాయకులు అత్తిలి రవీందర్ రెడ్డి, కవాడి రాజా వర్ధన్ రెడ్డి, నరేందర్ రెడ్డి, అత్తెల్లి రమణారెడ్డి, గ్రామ పెద్ద గొల్ల గడ్డం మల్లయ్య, పాల్గొన్నారు.






