17 March, 2026 | 4:58 PM

Breaking News

ఆరోగ్య కేంద్రంలో మెగా వైద్య శిబిరం   •   ఎమ్మెల్యే ఇంటిపై దాడి చేసిన వారిపై తుంగతుర్తి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు   •   పదవ తరగతిలో 100% ఫలితాలు   •   చెరువును పరిశీలించిన జిల్లా కలెక్టర్, ఎస్పీ   •   నందిని సిధారెడ్డికి సీఎం రేవంత్ శుభాకాంక్షలు   •   బావుసాయిపేట రైతు వేదికలో వ్యవసాయ అవగాహన కార్యక్రమం   •   ప్రజలకు ఇచ్చిన హామీలను ప్రభుత్వం అమలు చేయాలి   •   దేవరకొండ ప్రభుత్వ ఆసుపత్రిలో అస్తవ్యస్త వైద్య సేవలు: బీసీ సంక్షేమ సంఘం ఆగ్రహం   •   తెలంగాణలో హ్యామ్ రోడ్ల పేరిట రూ. 18 వేల కోట్ల స్కామ్   •   ఆత్మగౌరవం చంపుకొని ఉండలేను.. ఫిరాయింపు ఎమ్మెల్యేలను బయటకు పంపాలి   •  

పాక్ మాట విన్నారు.. మా మాట వినరేం..

27-05-2025 01:24 AM
  1. కాల్పుల విరమణపై స్పందించరెందుకు!

దండకారుణ్య స్పెషల్ జోనల్ కమిటీ ప్రతినిధి వికల్ప పేరిట మావోయిస్టుల లేఖ

నారాయణ్‌పూర్, మే 26: దాయాది పాకిస్థాన్ దేశం కోరితే కాల్పుల విరమణకు అం గీకరించిన కేంద్రం.. తాము చర్చలకు విజ్ఞప్తి చేసినా పట్టించుకోలేదని మావోయిస్టు పార్టీ ఆవేదన వ్యక్తం చేసింది. ఛత్తీస్‌గఢ్ సరిహద్దులోని నారాయణ్‌పూర్ సరిహద్దుల్లో ఇటీవల జరిగిన ఎన్‌కౌంటర్‌లో కేశవరావు అలియాస్ బసవరాజు సహా 28 మంది మావో యిస్టులు చనిపోయినట్టు ఆ వర్గాలు వెల్లడించాయి.

ఈ మేరకు దండకారణ్య స్పెషల్ జోన్ కమిటీ ప్రతినిధి వికల్ప పేరిట మావోయిస్టులు లేఖ విడుదల చేశారు. ఈ ఎన్ కౌంటర్‌లో 27 మంది మృతిచెందినట్టు ప్రభుత్వం వెల్లడించిందని.. అయితే, మరో మృతదేహాన్ని తాము తీసుకెళ్లినట్టు లేఖలో పేర్కొన్నారు. కేశవరావు టీమ్‌లో ఉన్న ఆరుగురు మావోయిస్టులు ఇటీవల పోలీసులకు లొంగిపోయారని, వాళ్లిచ్చిన సమాచారంతోనే ఈ దారుణం జరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు.

యూనిఫైడ్ కమాండో సభ్యుడొకరు సైతం ద్రోహిగా మారినట్టు లేఖలో పే ర్కొన్నారు. ఎన్‌కౌంటర్ ముందురోజు నుంచి 20 వేల మంది బలగాలు తామున్న ప్రాంతా న్ని చుట్టుముట్టి.. 10 గంటల్లో ఐదు ఎన్‌కౌంటర్లు చేశాయని మావోయిస్టులు లేఖలో తెలి పారు. 60 గంటల పాటు బలగాలు తమను నిర్బంధించాయని చెప్పారు.

అప్పటికే కేశవరావును సురక్షిత ప్రాంతానికి తరలించేందు కు యత్నించగా.. తమను వదిలి వెళ్లేందుకు ఆయన ఇష్టపడలేదన్నారు. నాయకత్వాన్ని ముందుండి నడిపించాలని తమతోనే ఉన్న కేశవరావు కోసం 35 మంది ప్రాణాలు అడ్డుపెడితే.. ఏడుగురం సురక్షితంగా బయటప డ్డామని, మిగిలిన వారంతా ఎన్‌కౌంటర్‌లో మరణించారని తెలిపారు.