10-09-2025 02:01:28 AM
గ్రేటర్ వ్యాప్తంగా 33 కేంద్రాల్లో కొనసాగింపు
నామమాత్రపు ధరకే రుచికరమైన భోజనం
మహిళలకు గౌరవప్రదమైన ఉపాధి
హైదరాబాద్ సిటీ బ్యూరో, సెప్టెంబర్ 9 (విజయక్రాంతి): మహిళలను పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్ది, వారిని కోటీశ్వరులను చేయాలనే తెలంగాణ ప్రభుత్వ ఉన్నత లక్ష్యానికి ఇందిరా మహిళా శక్తి క్యాంటీన్లు ఊత మిస్తున్నాయి.
జీహెచ్‌ఎంసీ సహకారంతో నగరంలోని స్వయం సహాయక సంఘాల మహిళలు నిర్వహిస్తున్న ఈ క్యాంటీన్లు, వారికి ఆర్థిక భరోసాను ఇవ్వడమే కాకుండా, నగర ప్రజలకు నామమాత్రపు ధరకే రుచికరమైన, పోషకాహారాన్ని అందిస్తూ ఆకలి తీరుస్తున్నాయి.
ప్రస్తుతం గ్రేటర్ వ్యాప్తంగా 33 క్యాంటీన్లు విజయవంతంగా నడుస్తూ ఎందరికో ఆదర్శంగా నిలుస్తున్నాయి. ఈ క్యాంటీన్లు మహిళలకు కేవలం ఉపాధి మార్గంగానే కాకుండా, వారిలో ఆత్మవిశ్వాసం, స్వావలంబన, సమాజంలో గౌరవా న్ని పెంచే వేదికలుగా మారాయి. వంటింటికే పరిమితమైన మహిళలు, నేడు పదుల సంఖ్యలో ప్రజలకు అన్నం పెట్టే అన్నపూర్ణలుగా, విజయవంతమైన వ్యాపారవేత్తలుగా ఎదుగుతున్నారు.
మహిళల విజయానికి నిలువుటద్దం
ఈ విజయ ప్రస్థానానికి నిలువుటద్దం జీహెచ్‌ఎంసీ ప్రధాన కార్యాలయంలోని ఇందిరా మహిళా శక్తి క్యాంటీన్. ఎన్‌బీటీ నగర్‌కు చెందిన స్నేహిత స్వయం సహాయక సంఘం సభ్యురాలు వసంత, మరో నలుగురు మహిళలతో కలిసి బ్యాంకు నుంచి రూ.5 లక్షల రుణం తీసుకున్నారు.
ఈ ఏడా ది మార్చిలో జీహెచ్‌ఎంసీ ప్రధాన కార్యాలయంలో ఏర్పాటు చేసిన ఈ క్యాంటీన్‌ను మేయర్ గద్వాల విజయలక్ష్మి, డిప్యూటీ మేయర్ మోతే శ్రీలతరెడ్డి ప్రారంభించారు. నేడు ఈ క్యాంటీన్ వందలాది మంది ఉద్యోగులకు, సందర్శకులకు రుచికరమైన భోజనాన్ని అందిస్తూ విజయవంతంగా నడుస్తోంది.
ఈ అవకాశం మా జీవితాలనే మార్చేసింది. నాకు, నాతో పాటు పనిచేస్తున్న మ హిళలకు ఆర్థిక భద్రత లభించింది. మాలో ఈ ఆత్మవిశ్వాసం నింపిన సీఎం రేవంత్‌రెడ్డికి, మాకు అండగా నిలిచిన జీహెఎంసీ అధికారులకు కృతజ్ఞతలు.
ఈ కార్యక్రమంలో జీహెచ్‌ఎంసీ భాగమై, మహిళల ముఖాలపై చిరునవ్వులు చూడ టం సంతోషంగా ఉంది. స్వయం సహాయక సంఘాల మహిళలు ఆర్థికంగా నిలదొక్కుకోవడం స్ఫూర్తిదాయకం. రాను న్న రోజుల్లో కూడా మహిళా సాధికారతకు జీహెఎంసీ తన పూర్తి సహకారాన్ని అందిస్తుంది.