అనవసరంగా వివాదంలోకి లాగారు
మాజీ జనరల్ నరవణె ఆవేదన
న్యూఢిల్లీ, ఏప్రిల్ 25: తన పుస్తకం ఇంకా పబ్లిష్ కాకపోయి నా తనను వివాదంలోకి లాగారంటూ భారత మాజీ సైన్యాధిపతి జనరల్ మనోజ్ ముకుంద్ నరవణె శనివారం ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీపై పరోక్షంగా విమర్శలు సంధించారు. నరవణె రచించిన ‘ఫోర్ స్టార్స్ ఆఫ్ డెస్టినీ’పై పలు ఆరోపణలు వస్తున్న సందర్భంగా ఈ వ్యాఖ్యలు చేశారు. ‘ద క్యూరియస్ అండ్ ద క్లాసిఫైడ్ అన్ ఎర్తింగ్ మిలిటరీ మిత్స్ అండ్ మిస్టరీస్’పై ఇటీవల విడుదలైన సందర్భంగా నరవణె పిటీఐతో మాట్లాడారు.
తాను రెండు పుస్తకాలు రాశాన ని వాటిలో ఒకటి విడుదలైందని ‘ఫోర్ స్టార్స్ ఆఫ్ డెస్టినీ’ అనే పుస్తకాన్ని పూర్తిగా పరిశీలించేవరకు ప్రచురణను నిలిపివేయమని రక్షణ మంత్రిత్వ శాఖ కోరిందన్నారు. ఈ విషయం అక్కడితో ముగిసిపోయిందన్నారు. కానీ పుస్తకాన్ని వెలుగులోకి తెచ్చిన కొందరు తనను కావాలనే వివాదంలోకి లాగారని ఆవేదన వ్యక్తంచేశారు. అది ఏ మాత్రం సమంజసం కాదన్నారు. రాహుల్‌గాంధీ లోక్‌సభకు తీసుకువెళ్లిన ఈ పుస్తకంలో చైనా దళాలతో భారత బలగాల ఘర్షణకు సంబంధించిన అంశాలను నరవణె ప్రస్తావించారు.






