19-06-2025 12:00:00 AM
భార్య, బిడ్డలు కలిసి తండ్రిని కొట్టి చంపారు
మహబూబాబాద్, జూన్ 18 (విజయ క్రాంతి): బిడ్డ మరో వ్యక్తితో ఫోన్లో మాట్లాడడాన్ని తప్పు బట్టి మందలించినందుకు కక్ష పెంచుకొని భార్య, ఇద్దరు బిడ్డలు, మరో ముగ్గురు వ్యక్తులతో కలిసి తండ్రిని కొట్టి చంపిన ఘటన మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలం డిఎస్‌ఆర్ జెండాల తండాలో జరిగింది. సంఘటనకు సంబంధించి మరిపెడ ఎస్ ఐ సతీష్ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.
తండాకు చెందిన ధరావత్ కిషన్ (40) తన చిన్న కూతురు పల్లవి గత సోమవారం ఫోన్లో ఓ వ్యక్తితో మాట్లాడుతుండగా ఇది తప్పని మందలించడంతో భార్య కావ్య, పెద్ద కూతురు రమ్య , బోడ చందు, బోడ దేవేందర్ తో కలిసి మృతున్ని చెట్టుకు తాడుతో కట్టేసి విపరీతంగా కొట్టడంతో తీవ్ర గాయాల పాలయ్యాడు. ఈ విషయం తల్లి సాంకి తెలుసుకొని సంఘటనస్థలికి చేరుకొని 108 అంబులెన్స్ లో మహబూబాబాద్ తీసుకువెళ్లి చికిత్స చేయించి మెరుగైన వైద్యం కోసం మంగళవారం ఖమ్మం తరలిస్తుండగా మరణించాడన్నారు. ఈ ఘటనపై మృతుడి తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్త్స్ర తెలిపారు.