calender_icon.png 15 July, 2025 | 5:02 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బీజేఎంసీని ఆదర్శంగా తీర్చిదిద్దుతా

19-06-2025 12:00:00 AM

ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ 

రాజేంద్రనగర్, జూన్ 18: బండ్లగూడ మున్సిపల్ కార్పొరేషన్ ను అన్ని విధాలుగా అభివృద్ధి చేసి ఆదర్శంగా తీర్చిదిద్దుతానని ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ అన్నారు.బుధవారం బండ్లగూడ మున్సిపాల్ కార్పొరేషన్ పరిధిలో రూ. 7కోట్ల 45 లక్షలతో 12 ,17, 18, 19, మరియు 20 వ వార్డు లలో వీడీసీసీ రోడ్ లు, యు జి డి పనులకు ఆయన శకుస్థాపన చేశారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ..

మున్సిపల్ కార్పొరేషన్ లోని అన్ని వార్డులలో దశలవారీగా అభివృద్ధి పనులు చేపడుతున్నామని తెలిపారు.కాంగ్రెస్ సర్కార్ విద్య, వైద్య రంగాలకు అత్యంత ప్రాధాన్యం ఇస్తున్నట్లు తెలిపారు. ఇది వరకు కాలనీలలో సీసీ రోడ్లు, డ్రైనేజీలు లేక జనం ఇబ్బందులు పడ్డారని గుర్తు చేశారు. వచ్చే నాలుగేళ్లలో మున్సిపాలిటీ రూపురేఖలు మారుస్తామన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ శరత్ చంద్ర, పలువురు నాయకులు, అధికారులుపాల్గొన్నారు.