calender_icon.png 23 October, 2025 | 5:05 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కాంగ్రెస్‌ని అట్టడుగుకు తొక్కేస్తాయ్..

23-10-2025 02:13:50 AM

నిజామాబాద్ అక్టోబర్ 22:(విజయక్రాంతి): ఆరు గ్యారంటీ లే కాంగ్రెస్ పార్టీని అంతం చేస్థాయని. హైదరాబాద్ నగరంలోని జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గంలో గెలుపు గులాబీ పార్టీదేనని నిజామాబాద్ భారాస లీగల్ సెల్ జిల్లా కన్వీనర్ దాదన్నగారి మధుసుదన్ రావు అన్నారు. పదేళ్ల కేసీఆర్ పాలనలో భాగ్యనగరంలో భాగ్యవం తులు భారీ పెట్టుబడులు పెట్టేటట్లు చేసిందని ఆయన తెలిపారు.హైదరాబాద్, సైబరబాద్, సికింద్రాబాద్ లలో ప్రగతిశీలక పథకాలకు వన్నెలద్ది వన్నెతెచ్చారని  పేర్కొన్నారు.

అభివృద్ధి నమూనాలో నూతన ఒరవడులు కేసీఆర్ దిద్దారని మధు వివరించారు. గత శాసనసభ ఎన్నికలలో హైదరాబాద్ నగరంలోని ఇరవై నాలుగు శాసనసభ స్థానాలు గెలుచుకోవడంలోని గొప్పతనం కనబడుతున్నదని విశ్లేశించారు. జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గంలో భారాస గెలువబోతున్నాదని తెలిపారు. భారాస లీగల్ సెల్ న్యాయవాద బృందాలు భారత రాష్ట్ర సమితి అభ్యర్థి గెలుపులో భాగస్వాములు కాబోతున్నాయని మధు సుధన్‌రావు తెలియజేశారు.

కాంగ్రె స్, బిజెపి లు తెలంగాణ రాష్ట్రానికి పట్టిన చెదలు అని వాటిని వదిలించుకోవడానికి జూబ్లీహిల్స్ ప్రజలు శ్రీకారం చుట్టబోతున్నారని ఆయన అన్నారు.హైదరాబాద్ లో ట్రాఫిక్ కష్టాలను తీర్చడానికి ఫ్లైఓవర్ ల నిర్మాణాలు నిర్మించిన, కష్టాలను దూరం చేసింది యువ నాయకత్వమైన కేటీఆర్ అనే సంగతిని గల్లీ గల్లీలో గుర్తు చేసుకుంటున్నారని ఆయన గుర్తు చేశారు.

ప్లైఓవర్లతో ఈతిభాదలు తీర్చొందే భారాస అనే భరోసాతో ప్రజలు ఉన్నారని, కేసీఆర్ హైదరాబాద్ అభివృద్ధి మూట రేపటి జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలలో కనపడి,జూబ్లీహిల్స్ జిలేబి మూట విప్పి, గులాబీ గెలుపుకు బాట వేయబోతున్నదని మధుసుధన్ రావు తెలిపారు.