calender_icon.png 23 October, 2025 | 5:10 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అమరులైన పోలీస్ కుటుంబాలకు అండగా ఉంటాం..

23-10-2025 02:15:03 AM

సీపీ సాయి చైతన్య         

నిజామాబాద్ అక్టోబర్ 22: (విజయ క్రాంతి)తెలంగాణ పోలీస్ అమరవీరుల కుటుంబ సభ్యులతో నిజామాబాద్ జిల్లా సిపి సాయి చైతన్య కలిశారు.బుధవారం రోజు తెలంగాణ రాష్ట్ర డి.జి.పి ఆదేశాల మేరకు పోలీస్ అమరవీరుల వారోత్సవాల సందర్భంగా పోలీస్ కమిషనరేట్ పరిధిలోని అమరులైన పోలీస్ కుటుంబ సభ్యులను పోలీస్ కమిషనర్ పి.సాయి చైతన్య,వారి ఇంటికి వెళ్లి వారిని విమర్శించారు.

ఈ సందర్భంగా పోలీస్ సిబ్బంది వారి కుటుంబ సభ్యులను కలిసి అమరుల ఫోటోలకు పూలమాలలు వేసి నివాళులు వాళ్లు అర్పించి కుటుంబ సభ్యులకు అండగా ఉంటామని హామీ ఇచ్చారు. ప్రభుత్వం నుంచి అందిన సహాయ సహకారాల గురించి అడిగి సుకున్నారు. ప్రభుత్వం నుండి అందాల్సిన సహాయం ఎలాంటి ఇబ్బందులు ఉన్నను తమ దృష్టికి తీసుకురావాలని కుటుంబ సభ్యులకు సిపి తెలిపారు. అమరులైన పోలీస్ కుటుంబాలకు అధికారులు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండాలని వారి బాగోగులను పర్యవేక్షించాలని తెలిపారు.

వారి కుటుంబాలకు ఎల్లవేళలా సహాయ సహకారాలు అందిస్తామన్నారు. ఎలాంటి సమస్యలు ఉన్న తమ దృష్టికి తీసుకురావాల్సిందిగా సిపి కోరారు.ఈ కార్యక్రమంలో అదనపు డీ.సీ.పీ (అడ్మిన్) బస్వారెడ్డి, నిజామాబాద్ ఏ సి.పి శ్రీ రాజ వెంకటరెడ్డి, ,ఎన్.ఐ.బి ఇన్స్పెక్టర్ వెంకటయ్య, రూరల్ పోలీస్ స్టేషన్ ఎస్ హెచ్ ఓ ఆరిఫ్,పోలీస్ అసోసియేషన్ అధ్యక్షులు షకిల్ పాషా పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.