calender_icon.png 11 July, 2025 | 12:51 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పలు నేరాలు చేసిన దొంగ అరెస్ట్

11-07-2025 12:00:00 AM

155 గ్రాములు బంగారం స్వాధీనం

ఖమ్మం, జులై 10 ( విజయ క్రాంతి ):గత కొన్ని సంవత్సరాలుగా ఇళ్ళల్లో పలు దొంగతనాలు చేస్తూ, అనేక సార్లు జైలు కు వెళ్ళి తిరిగివచ్చి మళ్లీ దొంగతనాలకు పాల్పడుతున్న ఖమ్మం, రేవతి సెంటర్ కు చెందిన దొన్ వాన్ ప్రేమ్ కుమార్ ను టూ టౌన్ పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్ కు పంపినట్లు సర్కిల్ ఇన్స్పెక్టర్ బాలకృష్ణ తెలిపారు.

జనవరి నెలలో మామిళ్ళగూడెం, వెంకటేశ్వర స్వామి గుడిలో కొంత నగదు, ఖమ్మం ద్వారకా నగర్ లొ ఒక ఇంట్లో,  ఖమ్మం, రేవతి సెంటర్ కు చెందిన దొన్ వాన్ ప్రేమ్ కుమార్ అను పాత నేరస్తున్ని అరెస్ట్ చేసిన ఖమ్మం 2 వ టౌన్ పోలీసులు. జనవరి నెలలో మామిళ్ళగూడెం, వెంకటేశ్వర స్వామి గుడిలో కొంత నగదు, ఖమ్మం ద్వారకా నగర్ లొ ఒక ఇంట్లో రాత్రి పూట దొంగ తనం చేసి బంగారు వస్తువులు దొంగిలించాడు. 

ఏప్రిల్ నెలలో ఖమ్మం సర్దార్ పటేల్ స్టేడియం వద్ద ఒక వ్యక్తి నడిచి వెళ్తుండగా అతని వద్ద గల రెండు బంగారు ఉంగరాలను దొంగిలించాడు. ఫిబ్రవరిలో ఖానాపురం హవేలీ పరిధి లొ వరదయ్య నగర్ లొ ఒక అపార్ట్ మెంట్ లొ బంగారు వస్తువులను దొంగిలించాడు.మొత్తం స్వాధీనం చేసుకున్న బంగారం 155 గ్రాములు (పదిహేను న్నర తులాలు)  వాటి మొత్తం ధర సుమారుగా రు.7,50,000/- అని పోలీసులు తెలిపారు.