calender_icon.png 6 July, 2025 | 10:55 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

యూత్‌కు బయోపిక్ లాంటి సినిమా ఇది

06-07-2025 12:22:30 AM

మిత్రశర్మ, గీతానంద్, శ్రీహాన్, జెన్నీఫర్ ఇమాన్యుల్, రోనిత్, అన్షుల ముఖ్య పాత్రల్లో రూపొందిన తాజాచిత్రం ‘వర్జిన్ బాయ్స్’. రాజ్‌గురు బ్యానర్‌పై రాజా దారపునేని నిర్మించిన ఈ చిత్రానికి దయానంద్ గడ్డం రచనా దర్శకత్వం వహించారు. ఈ సినిమా జూలై 11న ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఈ నేపథ్యంలో ఈ మూవీ ట్రైలర్‌ను శనివారం విడుదల చేశారు. ట్రైలర్ లాంచ్ కార్యక్రమంలో నటుడు గీతానంద్ మాట్లాడుతూ.. “యూత్‌కు బయోపిక్ లాంటి సినిమా ఇది. నిజమైన సంతోషం మందు, మత్తు పదార్థాల్లో ఉండదు. ఏదైనా సాధించినప్పుడు వస్తుంది” అన్నారు.

నిర్మాత రాజా దారపునేని మాట్లాడుతూ.. “ఈ సినిమా లో పెద్దవారు ఎవరూ లేరు. అయినా ఈ సినిమాకు సపోర్ట్ చేసినందుకు అందరికీ థాంక్స్‌” అన్నారు. ఇంకా ఈ కార్యక్రమం లో దర్శకుడు దయానంద్ గడ్డం, నటీనటులు రోనిత్, శ్రీహాన్, నటి మిత్ర శర్మ, మిగతా చిత్రబృందం తమ అనుభవాలు, అభిప్రా యాలను పంచుకున్నారు. 

ప్రేక్షకులకు ఐఫోన్లు బహుమతి.. 

‘వర్జిన్ బాయ్స్’ సినిమా టికెట్ కొన్న 11 మందికి ఐఫోన్లు బహుమతిగా ఇస్తామ’ని చిత్రబృందం ప్రకటించింది. ‘మనీ రైన్ ఇన్ థియేటర్స్’ అనే మరో కాన్సెప్ట్‌తో ప్రేక్షకుల ముందుకు వస్తున్నట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో భాగంగా మరికొన్ని ఎంపిక చేసిన థియేటర్లలో మూవీ రిలీజ్ రోజు డబ్బు వర్షం కురు స్తుందని.. ఆ డబ్బును ప్రేక్షకులు సొంతం చేసుకో వచ్చని చెప్పారు.