calender_icon.png 6 July, 2025 | 10:43 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బకాసుర.. ర్యాప్ సాంగ్

06-07-2025 12:25:30 AM

క్యారెక్టర్ ఆర్టిస్ట్, కమెడియన్ ప్రవీణ్ ప్రధాన పాత్రలో రూపొందుతున్న చిత్రం ‘బకాసుర రెస్టారెంట్’. ఇందులో వైవా హర్ష టైటిల్ రోల్‌లో నటిస్తుండగా కృష్ణభగవాన్, షైనింగ్ ఫణి, కేజీఎఫ్ గరుడరామ్ ఇతర ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు. ఎస్‌జే శివ దర్శకుడిగా పరిచయం కాబోతున్న ఈ చిత్రాన్ని ఎస్‌జే మూవీస్ పతాకంపై లక్ష్మయ్య ఆచారి, జనార్ధన్ ఆచారి నిర్మిస్తున్నారు. చిత్రీకరణ పూర్తిచేసుకున్న ఈ చిత్రం విడుదలకు సిద్దమైంది.

హంగర్ కామెడీ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతున్న ఈ చిత్రంలోని టైటిల్ ర్యాప్ సాంగ్‌ను దర్శకుడు అనిల్ రావిపూడి శనివారం విడుదల చేశారు. వికాస బడిస స్వరాలు సమాకూర్చిన ఈ పాటను ర్యాప్ సింగర్ రోల్ రైడ్, వికాస బడిస ఆలపించారు. ఈ సందర్భంగా అనిల్ రావిపూడి మాట్లాడుతూ “బకాసుర రెస్టారెంట్’ టైటిల్ బాగుంది. పాట చాలా కొత్తగా అనిపించింది. సినిమా ఐడియా బాగుంది. ప్రవీణ్ హీరోగా వస్తున్న ఈ చిత్రం మంచి సక్సెస్ కావాలి” అన్నారు. ఈ చిత్రానికి డీవోపీ: బాలసరస్వతి, ఎడిటర్: మార్తండ్ కే వెంకటేశ్; ఆర్ట్: శ్రీరాజా సీఆర్ తంగాల.