27-07-2025 12:44:39 AM
డార్లింగ్ కృష్ణ, మనీషా హీరోహీరోయిన్స్‌గా శశాంక్ దర్శకత్వంలో రూపొందుతున్న బహు భాషా చిత్రం ‘బ్రాట్’. డాల్ఫిన్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై మంజునాథ్ కంద్కూర్ నిర్మించారు. తాజాగా మేకర్స్ ఈ సినిమా నుంచి ‘యుద్ధమే రాని’ అనే పాటను నటుడు నరేశ్ వీకేతో విడుదల చేయించారు. అర్జున్ జన్య సంగీతం అందించిన ఈ పాటకు సనారె లిరిక్స్ అందించగా, సిద్ శ్రీరామ్ పాడారు. సాంగ్ లాంచ్ ఈవెంట్‌లో నరేశ్ వీకే మాట్లాడుతూ.. “మంజునాథ్ నాకు మంచి స్నేహితుడు. ఆడియన్స్ పల్స్ తెలిసిన ప్రొడ్యూసర్.
నాతో కన్నడలో సూపర్ డూపర్ హిట్ సినిమా చేశారు. చాలా రోజుల తర్వాత ఈ సినిమాతో వస్తున్నారు. పెద్ద సక్సెస్ కావాలని కోరుకుంటున్నా” అన్నారు. డైరెక్టర్ శశాంక్ మాట్లాడుతూ.. “కంటెంట్ మీద ఉన్న నమ్మకంతోనే ఈ సినిమా రిలీజ్ చేస్తున్నాం. అందరికీ రిలేట్ అయ్యే కథ ఇది” అన్నారు. ‘తెలుగు ఆడియన్స్ ఈ సినిమాను చూసి పెద్ద విజయాన్ని ఇవ్వాలని కోరుకుంటున్నాన’ని నిర్మాత మంజునాథ్ అన్నారు. హీరో డార్లింగ్ కృష్ణ, హీరోయిన్ మనీషా, ఆడియో కో ఓనర్ శ్యామ్, లిరిక్ రైటర్ సనారె, చిత్రబృందం పాల్గొన్నారు.