21 August, 2026 | 2:42 AM

జెన్‌జీలు మెచ్చే పొలిటికల్ ఎంటర్‌టైనర్ ఇది

21-08-2026 12:00 AM

సుమన్, సాయికుమార్, నటరాజ్, రాయంచ కొక్కుర వరుణ్‌సందేశ్, వితికా షేరు ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘ధర్మస్థల నియోజకవర్గం’. జై జ్ఞాన ప్రభ తోట దర్శకత్వంలో మూవింగ్ డ్రీమ్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ పతాకంపై మేరుం భాస్కర్ నిర్మిస్తున్నారు.

సెప్టెంబర్ 4న థియేటర్ల ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ పొలిటికల్ ఎంటర్‌టైనర్‌ను పీవీఆర్ సినిమాస్ డిస్ట్రిబ్యూషన్ ద్వారా తెలుగు రాష్ట్రాల్లో రిలీజ్ చేయనున్నారు. ఈ నేపథ్యంలో మేకర్స్ హైదరాబాద్‌లో ఈ చిత్ర ప్రెస్‌మీట్‌ను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నటుడు సుమన్ మాట్లాడుతూ.. “డైరెక్టర్ జైజ్ఞానప్రభ కథ చెప్పినప్పుడే ప్రేక్షకుల్ని ఆకట్టుకునే సినిమా అవుతుందని నమ్మా” అన్నారు. నటి కస్తూరి మాట్లాడుతూ.. “అర్థంపర్థం లేని కామెడీ, డ్రామా ఉన్న సినిమా కాదిది. ప్రేక్షకుల్ని ఆలోచింపజేసే చిత్రమిది.

ఇలాంటి సినిమా ఇప్పుడున్న సమాజానికి కావాలి. జెన్ జీ ఆటపాటలతో సరదాగా సమయం గడపడం లేదిప్పుడు, ఆలోచిస్తున్నారు. అలాంటి యువతకు కూడా ఈ సినిమా బాగా నచ్చుతుంది” అని చెప్పారు. ‘ప్రేక్షకులంతా మా సినిమాను తమదిగా భావించి ఆదరిస్తారని కోరుకుంటున్నాన’ని హీరో నటరాజ తెలిపారు. హీరోయిన్ వితికా షేరు మాట్లాడుతూ-.. “నేను హీరోయిన్‌గా పేరు తెచ్చుకోవడం కంటే ఒక నటిగా మంచి గుర్తింపు కోరుకుంటున్నా. నటిగా మంచి పేరు తెచ్చే క్యారెక్టర్‌ను ఈ సినిమాలో చేశా” అని తెలిపింది.

చిత్ర దర్శకుడు జైజ్ఞానప్రభ మాట్లాడుతూ.. “ఒక బిడ్డ ఈ ప్రపంచాన్ని చూడాలంటే ఎంత ప్రయాస ఉంటుందో.. అలాంటి కష్టాలన్నీ దాటుకుని, అన్నివర్గాల ప్రేక్షకుల్ని అలరించే ఒక మంచి మూవీతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాం” అని చెప్పారు. ‘మా సినిమా చూసిన ప్రతి ఒక్కరూ తప్పకుండా విజయం సాధిస్తుందని చెబుతుండటం సంతోషంగా ఉంద’ని నిర్మాత మేరుం భాస్కర్ అన్నారు. సంగీత దర్శకుడు మహావీర్ ఏలేందర్, పీవీఆర్ సినిమాస్ డిప్యూటీ జనరల్ మేనేజర్ ఉదయ్, ఇతర చిత్రబృందం ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.