calender_icon.png 5 August, 2025 | 6:37 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కేసీఆర్ వల్లే ఈ దుస్థితి

05-08-2025 01:44:13 AM

  1. స్థలం మార్పుతోనే కాళేశ్వరం కుంగుబాటు
  2. క్యాబినెట్ అనుమతి లేకుండానే బరాజ్‌ల నిర్మాణం

హైదరాబాద్, ఆగస్టు 4 (విజయక్రాంతి): స్థల మార్పిడితోనే కాళేశ్వరం ప్రాజెక్ట్ కుంగిందని జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ తన నివేది కలో స్పష్టం చేసింది. ఇందుకు ప్రధాన కార ణం అప్పటి సీఎం కేసీఆర్ తీసుకున్న నిర్ణయాలేనని తేల్చింది. తుమ్మడిహెట్టిని పక్కన బెట్టి మేడిగడ్డకు ప్రధాన ప్రాజెక్టును మార్చ డం వల్లే ఈ దుస్థితి వచ్చిందని చెప్పింది. స్థల మార్పిడి చేసే క్రమంలో కనీసం జియోలాజికల్, జియో ఫిజికల్ టెస్టులు చేయలే దని నివేదిక తెలియచేస్తోంది.

ఎట్టి పరిస్థితుల్లోనూ తుమ్మడిహెట్టి నుంచి మేడిగడ్డకు ప్రాజెక్టును మార్చొద్దని ఎక్స్‌పర్ట్ కమిటీ ఇచ్చిన నివేదికను కూడా తుంగలో తొక్కడంతోనే ప్రాజెక్ట్ పతనానికి నాంది పలికిన ట్టయింది. అలాగే కాళేశ్వరం ప్రాజెక్ట్ నిర్మాణంలో అడుగడుగున నిబంధనలను పట్టిం చుకోకుండా ముందుకు సాగినట్టు కాళేశ్వ రం నివేదికపై అధ్యయనం కోసం ఏర్పాటు చేసిన అధికారుల కమిటీ తెలిపింది.

బరాజ్ లు దెబ్బతినడానికి అప్పటి సీఎం తీసుకున్న నిర్ణయాలే కారణమని పేర్కొనడం.. నిర్మాణ స్థలం మార్పు, అంచనాల సవరింపులో అవకతవకలున్నాయని తెలియచేయడం, డిజైన్ల లోపాలు, నాణ్యత తనిఖీలు లేకపోవడంతో నష్టం జరిగిందని చెప్పడం చూస్తే అన్ని వేళ్లు కేసీఆర్ వైపే చూపిస్తున్నాయి. 

మేడిగడ్డ, సుందిళ్ల, అన్నారం బరాజ్‌ల నిర్మాణ నిర్ణయం అప్పటి సీఎం కేసీఆర్‌దేనని, ఎక్స్‌పర్ట్ కమిటీ నివేదికను సైతం అప్పటి సీఎం కేసీఆర్, నీటిపారుదల శాఖమంత్రి హరీశ్‌రావు పక్కనబెట్టారు.

ఎక్స్‌పర్ట్ కమిటీ విస్తృతంగా అధ్యయనం చేసి మేడిగడ్డ వద్ద బరాజ్ నిర్మాణం ఏ విధంగానూ మంచిది కాదని తేల్చింది. మేడిగడ్డ వద్ద కాకుండా ప్రాణహిత నదిపై వేమనపల్లి వద్ద బరాజ్‌ను నిర్మించాలని నిపుణుల కమిటీ సిఫార్సు చేసింది. కానీ ఇవేవీ బయటపడకుండా గత ప్రభుత్వ పెద్దలు జాగ్రత్తలు తీసుకున్నారు. 

క్యాబినెట్ అనుమతే లేకుండా..

తుమ్మిడిహెట్టి వద్ద నీటి లభ్యత లేదని పేర్కొనడం, అసలు బరాజ్‌ల నిర్మాణానికి క్యాబినెట్ అనుమతే తీసుకోకపోవడం చూ స్తే అప్పటి సర్కారు తీరు అర్థమవుతుంది. వ్యాప్కోస్ నివేదిక, డీపీఆర్ కంటే ముందే బరాజ్‌ల నిర్మాణానికి రెడీ అవ్వడం కాళేశ్వరం ప్రాజెక్టును ఏదోలా వేగంగా పూర్తి చేయాలని.. తద్వారా లాభం పొందాలని చూశారని తెలుస్తోంది. టెండర్లు, ఓఅండ్‌ఎం డిజైన్, నాణ్యతలో లోపాలు ఈ విషయాల ను స్పష్టం చేస్తున్నాయి.

బరాజ్‌ల నిర్మా ణా నికి పూర్తి బాధ్యత అప్పటి సీఎం కేసీఆర్‌దేనని వీటన్నింటిని బట్టి తేలింది. గత సర్కారు ఏమాత్రం జవాబుదారీతనం లేకుండా వ్యవహరించిందని కాళేశ్వరం కమిషన్ విచారణ లో వెల్లడైంది. అధికారులకు అప్పటి సీఎం కేసీఆర్, హరీశ్‌రావు ఇష్టానుసారంగా ఆదేశాలు ఇస్తూ పోయారు. కేసీఆర్ లెక్కలేనన్ని సార్లు గూగుల్ మ్యాప్స్ ద్వారా ప్రాజెక్టు ప్రజెంటేషన్ ఇస్తూ తానే పెద్ద ఇంజినీర్ అనేలా వ్యవహరించారని అనేక మంది సాగునీటి పారుదల శాఖ నిపుణులు ఆగ్ర హం వ్యక్తం చేశారు.

ఇదే క్రమంలో అప్పటి ఆర్థికశాఖ మంత్రి ఈటల రాజేందర్ సైతం ఆర్థిక క్రమశిక్షణ పాటించలేదని కమిషన్ నివేదిక స్పష్టం చేసింది. ఆయనో మూగ నేరస్తుడిగా మారిపోయినట్టుగా అధికారుల కమిటీ ఆరోపించింది. ప్రణాళిక, నిర్మాణం, ఓఅండ్‌ఎం, నీటి నిల్వ, ఆర్థిక అంశాలకు అప్పటి సీఎందే బాధ్యత అంటూ ఈటల తప్పించుకొనే ప్రయత్నం చేశారు. ప్రాజెక్టు అధికారులు, నిర్మాణ సంస్థతో కుమ్మక్కవ్వడంతో మేడిగడ్డ బరాజ్ నిర్మాణంలో ప్రజాధనం దుర్వినియోగమైంది.